Begin typing your search above and press return to search.
కలిసిన కాంగ్రెస్, బీజేపీ.. పరువు పాయే..
By: Tupaki Desk | 28 Jan 2020 8:26 AM GMTతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకుంది. ఒక ప్రాంతీయ పార్టీని అడ్డుకోవడానికి జన్మలో కలవని ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి. ఈ వార్త తెలంగాణ లోనే కాదు.. దేశంలోనే వైరల్ గా మారింది.
తాజాగా విలేకరుల సమావేశం లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అన్నారు. ఒకటి, రెండు మున్సిపాలిటీల కోసం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని.. పేరుకే అవి ఢిల్లీ పార్టీలని.. చేసేవి సిల్లీ పనులు అంటూ విమర్శించారసు. దీన్ని బట్టి బ్రహ్మం గారు చెప్పిన చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తోందని సెటైర్లు వేశారు. ఇక నుంచి ఉత్తమ్ బీజేపీ కండువా, కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొన సాగింది. ఎక్కడా ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ప్రభావం చూపలేదు. అయితే ఈ రెండు పార్టీలు మెజార్టీ సీట్లకు తక్కువ సాధించిన చోట అపవిత్రంగా పొత్తు పెట్టుకొని మున్సిపల్ చైర్మన్ స్థానాలను దక్కించుకున్నాయి. దేశం పుట్టినప్పటి నుంచి బద్ద శత్రువులు గా ఉంటున్న ఈ జాతీయ పార్టీలు అపవిత్రం గా ఒక ప్రాంతీయ టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం ఏకమవ్వడం తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ఈ వార్త తెలిసి ఆ జాతీయ పార్టీల పరువు పోతోంది.