Begin typing your search above and press return to search.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు

By:  Tupaki Desk   |   25 Jan 2020 4:52 AM GMT
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు
X
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 2619 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించి ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పెద్దపల్లిలో టీఆర్ఎస్7 - కాంగ్రెస్ 1 - బీజేపీ1 వార్డుల్లో విజయం సాధించాయి. ఇక వర్ధన్నపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

*మంత్రి కొప్పుల ఈశ్వర్ సొంత ఇలాఖా అయిన ధర్మపురి మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేవలం ఒక్క వార్డు తేడాతో అతి కష్టం మీద ఇక్కడ మున్సిపాలిటీ ని టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీని టీఆర్ఎస్ కు ఇచ్చింది.

*ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ని టీఆర్ఎస్ కైవసం చేసుకొని ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కూడా సత్తా చాటింది.
*వర్ధన్నపేట పురపాలక స్థానాన్ని కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది.
*వేములవాడ లో 4 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది
*వరంగల్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
*భైంసాలో 3 చోట్ల ఎంఐఎం విజయం సాధించింది.
*బాన్సువాడలో తొలి మూడు వార్డులు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
*ఎల్లారెడ్డిలో 4 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది.
*జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగింది.
*బొల్లారంలో 3 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది.
*ఆధిభట్లలో రెండు వార్డులను కాంగ్రెస్ గెలవడం విశేషం.
*సూర్యపేటలో టీఆర్ఎస్ బోణి.1వార్డులో గెలుపు
*పరకాలలో 11 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది.
*సిరిసిల్లలో నాలుగు వార్డుల్లో టీఆర్ఎస్ గెలిచింది.