Begin typing your search above and press return to search.
ఇప్పటికే టార్గెట్ గ్రూపుల్లోని వారికి రూ.4వేలు వెళ్లిపోయాయా?
By: Tupaki Desk | 4 Aug 2022 4:22 AM GMTఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మాటకు వస్తే.. రానున్న మూడు.. నాలుగు నెలలు రాజకీయాలు మొత్తం మునుగోడు చుట్టూనే తిరగటం ఖాయమని చెప్పక తప్పదు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ కావటం.. కమలం పార్టీలో చేరాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఉప ఎన్నిక ఖాయమని చెప్పాలి. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. నిబంధనలకు అనుగుణంగా ఉప ఎన్నిక ఖాయమని చెప్పక తప్పదు.
ఉప ఎన్నిక ఫలితానికి తగ్గట్లు తెలంగాణ రాజకీయ రూపురేఖలు మార్పులు చోటు చేసుకోవటమే కాదు.. భవిష్యత్తు రాజకీయాల్ని సైతం ప్రభావితం చేయటం ఖాయమన్న సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్ గా మునుగోడు ఉప ఎన్నిక మారుతుందన్న మాట వినిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డి ఏదో రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ఖాయమన్న మాట జోరుగా ప్రచారమవుతున్న వేళలో.. రాజీనామా నిర్ణయం పెద్ద షాక్ కు గురి చేయలేదు.
అధికారికంగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే రాజీనామా ఆమోదానికి గురి కాలేదు కాబట్టి.. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్న దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. మునుగోడుకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. దాని సారాంశం ఏమంటే.. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన డబ్బు పంపిణీ కార్యక్రమంలో ఒక విడత ఇప్పటికే పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.
కీలకమైన ఎన్నికల నాటికి తాను అనుకున్న తాయిలాలను పంపిణీ చేసే విషయంలో తిప్పలు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. ముందస్తు ఆడ్వాన్సుగా.. టార్గెట్ చేసుకున్న గ్రూపులకు రూ.4వేలు చొప్పున ఇప్పటికే చేరినట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజం పాళ్లు ఎంతన్నది పక్కన పెడితే.. ఇలా జరగటానికి అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. మునుగోడుకు సంబంధించి ఇలాంటి వార్తలు రానున్న రోజుల్లో మరిన్ని రావటం ఖాయమంటున్నారు.