Begin typing your search above and press return to search.

వైర‌స్ అదే ఉధృతి: ప‌ది వేలు దాటిన తెలంగాణ‌

By:  Tupaki Desk   |   24 Jun 2020 4:37 PM GMT
వైర‌స్ అదే ఉధృతి: ప‌ది వేలు దాటిన తెలంగాణ‌
X
వైర‌స్ ప్ర‌వేశించి రెండు వేల‌కు చేర‌గానే త‌గ్గింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలోనే ఒక్క‌సారిగా దాడి మొద‌లుపెట్టింది. రోజుకు వంద నుంచి మొద‌లుకుని ఇప్పుడు వెయ్యికి చేరువ‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ విధంగా తెలంగాణ‌లో వైర‌స్ విజృంభ‌ణ భీక‌రంగా ఉంది. తాజాగా 891 కేసులు న‌మోదు కాగా వాటితో ప‌ది వేల మార్క్‌ను తెలంగాణ దాటింది. ఈ కేసుల‌తో క‌లిపి రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం కేసులు 10,444కి చేరాయి. కొత్త‌గా ఐదు మంది మృతువాత ప‌డ‌గా మొత్తం మృతుల సంఖ్య 225.

ఈ విష‌యాన్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్ ప్ర‌క‌టించింది. బుధ‌వారం 4,069మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 891 పాజిటివ్ తేలాయి. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 5,858 ఉన్నాయి. కొత్త‌గా 137 మంది ఆస్ప‌త్రుల నుంచి ఇళ్ల‌కు డిశ్చార్జ‌య్యారు. వీరితో క‌లిపి డిశ్చార్జైన వారి సంఖ్య 4,361.

ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా చేసిన టెస్టులు 67,318. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 719 ఉన్నాయి. ఇక రంగారెడ్డి 86, మేడ్చ‌ల్ 55, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం 6, సంగారెడ్డి 2, వ‌రంగ‌ల్ గ్రామీణ 3, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణ 3, న‌ల్గొండ 2, కామారెడ్డి, సిద్దిపేట‌, జోగులాంబ గ‌ద్వాల, పెద్ద‌ప‌ల్లి, సూర్య‌పేట‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబాబాద్‌, ఆదిలాబాద్‌, సిరిసిల్ల జిల్లాల‌‌లో ఒక్కోటి చొప్పున కేసులు న‌మోద‌య్యాయి.