Begin typing your search above and press return to search.
వలస కార్మికుల తరలింపులో తెలంగాణ కొత్త విధానం
By: Tupaki Desk | 20 May 2020 11:10 AM GMTపొట్ట చేత బట్టుకుని ఉపాధి కోసం రాష్ట్రాలు దాటి వచ్చారు. ప్రస్తుతం ఆ మహమ్మారి రాక పని చోట ఉపాధి లేదు.. బతుకు కష్టమైంది. దీంతో సొంత ప్రాంతాలకు వెళ్దామని వలస కార్మికులు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అతికష్టం మీద కాలినడకన వెళ్తున్నారు. మరికొందరు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల తరలింపులో కొత్త విధానం పాటించనుంది. కార్మికుల తరలింపునకు సంబంధించి రైలు ఖర్చులు తెలంగాణనే భరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్మికుల తరలింపునకు చర్యలు చేపట్టింది.
అయితే ఒక్కో రైల్‌లో 1,200-1,400 మంది మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంది. కార్మికులేమో వేల సంఖ్యలో ఉన్నారు. ఎవరిని స్వస్థలాలకు పంపాలనే విషయంలో గందరగోళం ఏర్పడిన సందర్భంలో లాటరీ విధానం గుర్తుకొచ్చింది. కార్మికుల తరలింపునకు లాటరీ విధానంలో వాడి ఎంపికైన వారిని మాత్రమే పంపనున్నారు. కార్మికులందరూ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ ప్రయాణ ఏర్పాట్లు చేయడం కష్టంగా ఉంది. అయితే ఒక్కో రైలుకు ప్రతి ప్రాంతం నుంచి 10-15 మందికి అవకాశం కల్పించాలని, వారిని ఆయా స్టేషన్‌లకు బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. దీనికోసం లాటరీ వేస్తున్నారు.
ఎంపికైన 15 మందికి ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ లాటరీ విధానంలో ఎంపిక చేసి 80 వేల మందిని తరలించారు. తోపులాట.. గందరగోళం ఉండకుండా ప్రభుత్వం లాటరీ విధానం ఎంపిక చేసుకుంది. అయితే తమ పేర్లు ఎప్పుడు వస్తాయోనని కార్మికులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. కొందరేమో లాటరీలో తమ పేర్లు వస్తాయో రావోనని కాలినడకన స్వస్థలాలకు బయల్దేరుతున్నారు.