Begin typing your search above and press return to search.
కీలక హెచ్చరిక వచ్చేసింది.. వచ్చే 4 వారాలే కీలకం
By: Tupaki Desk | 7 Jan 2022 6:30 AM GMTకీలక ప్రకటన వెలువడింది. ఈ మధ్యనే మూడో వేవ్ వచ్చేసిందన్న మాటను చెప్పిన తెలంగాణ వైద్య ఆరోగ్యం సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు తాజాగా కీలక వార్నింగ్ ఇచ్చేశారు. రానున్న నాలుగు వారాలు కీలకమని.. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60-70 శాతం కేసులు ఒమిక్రాన్ వేనని వెల్లడించారు. దేశంలో థర్డ్ వేవ్ షురూ అయ్యిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుందని.. జీహెచ్ఎంసీ.. రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాల్లో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదు అవుతున్నట్లు చెప్పారు. కేసుల సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరుగుదల ఉందని చెప్పారు. పాజిటివిటి రేటు కూడా ఒక శాతం నుంచి 3.5 శాతానికి పెరిగినట్లు చెప్పారు.
కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం ఏమంటే.. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు మాత్రం రావటం లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు కూడా ఉండటం లేదని.. ఆక్సిజన్.. ఐసీయూలో చేరకలు లేకపోవటం సానుకూలాంశంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని.. రాబోయే రోజుల్లో 90 శాతం కేసులు అవే ఉంటాయన్నారు. ఇప్పటికి డెల్టా వేరియంట్ కేసులు వస్తున్నట్లు చెప్పారు.
లాక్ డౌన్ విధించే అవకాశం లేదని.. వచ్చే నాలుగు వారాల్లో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చన్న అంచనాను వేస్తున్నారు. జనవరి చివరి నాటికి కేసుల సంఖ్య బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం ముగిసేసరికి.. క్రమేణా తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ థర్డ్ వేవ్ లో ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదని.. మరణాల శాతం సున్నాగా చెప్పారు.
దేశ వ్యాప్తంగా కేసుల వ్యాప్తి 2 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉందని.. 95 శాతం మంది బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించటం లేదన్నారు. ఇప్పుడు కొవిడ్ బారిన పడినోళ్లు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని.. సాధారణ లక్షణాలు ఉన్న వారు కూడా భయంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని.. ఆ అవసరం లేదని చెబుతున్నారు. తీవ్రమైన లక్షణాలుఉన్న వారు మాత్రం ఆసుపత్రుల్లో చేరాలన్నారు.
లక్షణాలు ఎక్కువై ఆయాసం వస్తున్నా.. ఆక్సిజన్ 93 శాతం కంటే తక్కువగా ఉన్నా.. వెంటనే ఆసుపత్రిలో చేరాలని చప్పారు. ఐసోలేషన్ కు ఐదు రోజులే గరిష్ఠమని పేర్కొన్నారు. రోగులను అనవసరంగా చేర్చుకోవద్దని.. అవసరమైన వారిని మాత్రమే చేర్చుకోవాలన్నారు. కొందరు వైద్యులు పేషెంట్లకు ఖరీదైన మందులు వాడుతున్నారని.. ఆ అవసరం లేదన్నారు.
మోనోక్లోనల్ యాంటీబాడీస్, టోసిలిజుమాబ్ లాంటి మందులు కరోనా రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే వాడాలని చెబుతన్నారు. సొంత వైద్యాలు చేసుకోవటం మానాలని చెబుతున్నారు. ఏమైనా లక్షణాలు ఉంటే.. పరీక్షలు చేసుకోవాలని చెబుతున్నారు. పాజిటివ్ గా తేలితే.. వైద్యుడి సలహాతో వైద్యం చేయించుకోవాలని చెబుతున్నారు. మొత్తంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. అందరూ అప్రమత్తంగాఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.