Begin typing your search above and press return to search.
టీ ఛానళ్ల ఫోకస్ మొత్తం ఆంధ్రా మీదనేనట!
By: Tupaki Desk | 22 May 2019 4:57 AM GMTపేరుకు తెలుగు ఛానళ్లు అయినా.. విభజన నేపథ్యంలో ఆంధ్రా.. తెలంగాణ ఛానళ్లుగా ఆవిర్భవించటం.. అదే తీరులో కొనసాగించటం తెలిసిందే. ఈ రెండింటికి భిన్నంగా మూడో రకం ఛానళ్లు ఉన్నాయి. ఇందులో.. తెలంగాణకు.. ఆంధ్రాకు సమ ప్రాధాన్యం ఇస్తామంటూ చెప్పుకుంటూ బండి లాగిస్తున్నారు. పేరుకు తగ్గట్లే.. ఏ పేరు మీద ఉన్న ఛానల్ ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాల మీదనే ఫోకస్ పెట్టటం తప్పు పట్టాల్సిన పని లేదు. అందునా తెలంగాణకు ప్రాధాన్యం లభించలేదన్న పేరుతో ఏర్పాటు చేసిన ఛానళ్లు.. మరెవరికి చోటు ఇవ్వకపోవటంలో విచిత్రమేమీ ఉండదనే చెప్పాలి.
మరి.. అలాంటి ఛానళ్లు సైతం రేపు వెలువడే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఫలితాలతో పాటు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నది ఆంధ్రప్రదేశ్ లో వెలువడే ఫలితాల మీదనే దృష్టి పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ.. తెలంగాణవాసులకు ఇక్కడి ఫలితాల కంటే కూడా ఏపీలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు? అన్నది ప్రధానాంశంగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఈ కారణంతో తెలంగాణ ఛానళ్ల దృష్టి మొత్తం ఇప్పుడు ఏపీ మీదనే ఉందంటున్నారు. ప్రేక్షకుల ఛాయిస్ ఏం ఉంటుందో దానివైపే ఛానళ్లు మొగ్గు చూపుతాయి. తాము తెలంగాణ ఫలితాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి.. ఏపీ ఫలితాల్ని పట్టించుకోకపోతే.. తమ వీక్షకులు వేరే ఛానళ్లకు వెళ్లిపోవటం ఖాయమన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే తమ లైన్ కు భిన్నంగా ఏపీ ఫలితాల మీదనే ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ ఛానళ్లలో ఆంధ్రారాజకీయాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విశ్లేషణలు రేపు వెలువడటం ఖాయమంటున్నారు. వీక్షకుల ఇష్టాయిష్టాలు.. టీఆర్పీల ముందు ఎవరైనా తమ లైన్ మార్చుకోవాల్సిందేగా!