Begin typing your search above and press return to search.
కాగ్ రిపోర్ట్: తెలంగాణ దేశంలోనే నంబర్ 1
By: Tupaki Desk | 26 Jun 2018 5:06 AM GMT‘తెలంగాణ ఏర్పడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. కరెంట్ లేక చిమ్మి చీకట్లు కమ్ముకుంటాయి.. నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి.. మావోయిస్టులు పెరిగిపోతారు..’ ఇలా ఎన్నో అపశకునాలు.. శాపనార్థాల నడుమ తెలంగాణ పురుడుపోసుకుంది. పట్టువదలని తెలంగాణ సమాజం అసాధ్యమనుకున్న స్వరాష్ట్ర కలను సుసాధ్యం చేసుకుంది. ఉద్యమసేనాని కేసీఆర్ గద్దెనెక్కారు. చిక్కుముడులన్నీ విప్పారు. తెలంగాణ ఏర్పడగానే ‘కరెంట్ ఇవ్వడం చేతకాదా..?’ అని ఎద్దేవ చేసిన చంద్రబాబు మాటలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కరెంట్ సమస్యపై మొదట యుద్ధం ప్రకటించారు. చత్తీస్ ఘడ్ తో ఒప్పందం సహా ఇతర మార్గాల ద్వారా తెలంగాణ చిమ్మి చీకట్లను పారద్రోలాడు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త అయ్యేది.. ఇప్పుడు కేసీఆర్ పాలనలో కరెంట్ పోతే వార్త అయ్యేలాగా పరిస్థితి మెరుగుపడింది. ఆ తర్వాత సకలజనుల సర్వేతో కేసీఆర్ తెలంగాణ సమాజ రూపురేఖల్ని గుప్పిట పట్టారు. ఎవరికీ ఏం చేయాలనేది నిర్ణయించి ఆ తర్వాత ప్రకటించిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. పారిశ్రామికీకరణతోపాటు అదే సమయంలో వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందించారు. అన్ని రంగాలను, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ కేసీఆర్ ముందుకు పోతున్నారు. ఆ పనితనానికి ఇప్పుడు మార్కులు పడ్డాయి. తెలంగాణ దేశంలోనే అత్యధిక వృద్ధిరేటుతో దూసుకుపోతోంది.
దేశవ్యాప్తంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సర్వే చేసి నివేదక ఇచ్చింది. తెలంగాణ ప్రగతి చక్రాన్ని కళ్లకు కట్టింది. గత నాలుగేళ్లలో రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు దేశంలోనే తొలిస్థానంలో ఉందని కాగ్ రిపోర్టు ఇచ్చింది. 2014 జూన్ నుంచి 2018 మే వరకు దేశంలోని ఆయా రాష్ట్రాల వృద్ధి రేట్లను కాగ్ వెల్లడించింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.. ప్రతి ఏడాది నమోదైన ఆదాయ వృద్ధిని వెబ్ సైట్ లో కాగ్ పొందుపరిచింది. గత నాలుగేళ్ల కాలంలో తెలంగాణరాష్ట్రం 17.2 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్టు కాగ్ ప్రకటించింది. 14.2 శాతంతో హర్యానా రెండో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర మూడు - ఒడిశా నాలుగు - పశ్చిమ బెంగాల్ 5వ స్థానంలో నిలిచినట్టు కాగ్ వివరించింది. ఈ ఐదు రాష్ట్రాలు మాత్రమే 10శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేశాయని పేర్కొంది.
దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ వృద్ధి రేటు లేక సతమతమవుతున్నాయని కాగ్ పేర్కొంది. తెలంగాణ మాత్రం 10కి పైగా వృద్ధిరేటుతో ప్రతీ సంవత్సరం దూసుకుపోయినట్టు పేర్కొంది. 2015-16 ఆర్థికసంవత్సరంలో 13.7శాతం - 2016-17లో 21.1శాతం - 2017-18 లో 16.8 శాతం వృద్ధి రేటును సాధించింది. ఈ నాలుగేళ్ల సగటు లెక్కగడితే 17.2 వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే ముందంజలో నిలిచింది.
తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలవడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల వృద్దిరేటు 10శాతం లోపే ఉందని కేసీఆర్ అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నోట్ల రద్దు - జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా స్థిరమైన వృద్ధి సాధించామని చెప్పారు. ఆదాయ వృద్ధితో అభివృద్ధి - సంకేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
మొత్తంగా తెలంగాణ పడిలేచిన కెరటంలో నిలదొక్కుకుంది. విడిపోతే పడిపోతారన్న విమర్శల నడుమ సగర్వంగా తలెత్తుకొని నిలబడింది. నాయకత్వపు లక్షణాలు లేని వారంటూ విమర్శించిన నోళ్లే ఇప్పుడు అదే నాయకత్వ పటిమను కొనియాడుతున్నారు. స్వయంకృషితో నాలుగేళ్లలో దేశంలోనే నంబర్ 1 గా ఎదిగిన ప్రజల స్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.