Begin typing your search above and press return to search.

యాంటీజెన్ నెగిటివ్ వస్తే కరోనా రానట్లు కాదా?

By:  Tupaki Desk   |   22 July 2020 7:50 AM GMT
యాంటీజెన్ నెగిటివ్ వస్తే కరోనా రానట్లు కాదా?
X
కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చినంతనే.. పరీక్ష చేసుకునే అవకాశం కొద్ది రోజులుగా తెలంగాణలో కల్పిస్తున్నారు. వాస్తవానికి ఈ యాంటీజెన్ టెస్టులు ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ముందు నుంచి చేస్తున్నారు. ఇందులో ఉమ్మి శాంపిల్ తీసుకొని.. అందులో వేసినంతనే.. పలితం ఏమిటన్నది అరగంటలో వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన కిట్లు భారీగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

గడిచిన పదకొండు రోజుల వ్యవధిలో తెలంగాణలో దాదాపు30 వేల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్ని నిర్వహించారు. అందులో ఫలితం నెగిటివ్ వచ్చినంతనే సంబరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నెగిటివ్ వచ్చిన వారు మరో పద్దతిలో టెస్టు చేసినప్పుడు తక్కువలోతక్కువ 20 నుంచి 30 శాతం మంది పాజిటివ్ గా తేలుతున్నారు. దీంతో.. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు తొలిదశలో యాంటీ జెన్ టెస్టు చేయించుకోవటం.. తర్వాత ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

ఐసీఎంఆర్ చెప్పిన దాని ప్రకారం కూడా యాంటీజెన్ లో నెగిటివ్ వచ్చినంతనే వదిలిపెట్టకుండా ఆర్టీ- పీసీఆర్ పరీక్ష చేసుకోవటం ద్వారా వైరస్ సోకిందా? లేదా? అన్న విషయం మీద మరింత స్పష్టమైన నిర్దారణ చేసుకునే వీలుంది. కొందరు లక్షణాలు కనిపించినంతనే యాంటీజెన్ పరీక్ష చేయించుకొని నెగిటివ్ వచ్చిందని ఊరుకుంటున్నారు. ఇలాంటి వారు తర్వాతి కాలంలో అస్వస్థతకు గురై ప్రాణాలు పోతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.

యాంటీజెన్ టెస్టులో.. వైరస్ ఉందా? లేదా? అని తెలుసుకోవటానికి నలభై ఐదు శాతం నుంచి యాభై ఐదుశాతం లోపే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికినిర్వహించే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కూడా 70 నుంచి 85 శాతం లోపే పక్కాగా తేలే అవకాశం ఉంది. ఊపిరితుత్తుల్లో సిటీ స్కాన్ ద్వారా మింత స్పష్టంగా తెలుసుకునే వీలుంది. కానీ..ఇది ఖరీదైన వ్యవహారం కావటంతో సింఫుల్ గా అయిపోయే టెస్టులు చేస్తున్నారు. అందుకే.. యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వస్తే.. ఏం కాలేదని భావిస్తే తప్పులో కాలేసినట్లే.