Begin typing your search above and press return to search.

నెంబర్ 1 లో తెలంగాణ ..చివర్లో ఆంధ్రప్రదేశ్!

By:  Tupaki Desk   |   20 Aug 2020 5:30 AM GMT
నెంబర్ 1 లో తెలంగాణ ..చివర్లో ఆంధ్రప్రదేశ్!
X
ఇంటింటికి నదీ జలాలను నల్లా కనెక్షన్ ద్వారా అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. 98.31 శాతం ఇళ్లకి నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. ఏ ఇతర రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేకపోయింది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జల్‌ జీవన్‌ మిషన్‌ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో మొత్తం 54.38 లక్షల ఇళ్లు ఉండగా 53.46 లక్షల ఇళ్లకి మిషన్‌ భగీరథ పథకం ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్నది. కేంద్రజల్ ‌శక్తి మంత్రిత్వశాఖకు చెందిన జైజీవన్‌ మిషన్‌ బుధవారం వెల్లడించిన గణాంకాల్లో ఇది వెల్లడైంది.

ఇక , దేశవ్యాప్తంగా 1,897.93 లక్షల ఇళ్లులు ఉండగా 517.97 లక్షల ఇళ్లకి నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నదని, ఇది సరాసరి 27.28% మాత్రమే. నల్లాలతో తాగు నీరు ను ఇంటికి చేర్చడంలో ఇతర ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేకపోవడం విశేషం. తెలంగాణ తర్వాత 89.05 శాతంతో గోవా రెండోస్థానంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.02తో మూడు, 79.78 తో హర్యానా నాలుగోస్థానంలో నిలిచాయి. ఇక. గుజరాత్‌ 74.16% తో ఐదో స్థానంలో నిలిచింది. ఇక , ఏపీ మాత్రం కేవలం 34.71% ఇళ్లకే నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తుంది. ఏపీలో 95.66 లక్షల ఆవాసాలుండగా.. 33.21 ఇళ్లకే నల్లా నీళ్లు అందుతున్నా యి. ఛత్తీస్‌గఢ్‌ 11.93% - మహారాష్ట్ర42.90% - కర్ణాటక 28.94% ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నాయి. ఇక 2.05 శాతంతో చివరిస్థానంలో పశ్చిమబెంగాల్‌ ఉన్నది. మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణలో గతంలో ఇంటింటికి నల్లా లేదు. కొత్తగా రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాగునీటి సమస్యను మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ‘మిషన్‌ భగీరథ’ పథకానికి రూపకల్పన చేశారు. ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభమైన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పలు రాష్ట్రాలు అధికారులు తెలంగాణకు వచ్చి మిషన్‌భగీరథ పథకాన్ని అధ్యయనం చేసి వెళుతున్నారు.