Begin typing your search above and press return to search.

కోపంతో విపక్షాల అనూహ్య నిర్ణయం

By:  Tupaki Desk   |   29 Dec 2016 7:18 AM GMT
కోపంతో విపక్షాల అనూహ్య నిర్ణయం
X
తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని తెలంగాణ విపక్షాలు ప్రదర్శించాయి. తమ ఆకాంక్షలకు భిన్నంగా.. తమ వాదనల్ని పట్టించుకోకుండా భూసేకరణ బిల్లుకు అధికారపక్షం ఆమోదం తెలపటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భూసేకరణ బిల్లు ఆమోదం సందర్భంగా నిరసన తెలిపి వాకౌట్ చేసే టైం ఇవ్వకపోవటంపై స్పీకర్ తీరును తెలంగాణ టీడీపీ నేతలు తప్పు పట్టాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పదే పదే చెబుతున్నా.. ఆయన తీరులో ఎలాంటి మార్పులు లేవని టీ తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరులపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ విపక్షాలు కాంగ్రెస్.. తెలుగుదేశం.. సీపీఎం గురువారం అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ నేతలు మాత్రం తాము ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. భూసేకరణ చట్టం ఆమోదంపై బుధవారం సభ జరిగిన తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చట్ట సవరణ సందర్భంగా విపక్షాలు తమ వాదనను వినిపించేందుకు వీలుగా సమాయాన్ని ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ విధానాల్ని తప్పు పట్టిన వారిని.. వారి వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిని అణిచివేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోసించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/