Begin typing your search above and press return to search.
ఆర్టీసీ : జనం మద్దతు ఎందుకు రావడం లేదు?
By: Tupaki Desk | 31 Oct 2019 1:30 AM GMTతెలంగాణలో ఆర్టీసీ సమస్య అంతులేని కథగా మారింది. ఇప్పటి వరకు రాష్ర్టానికి మాత్రమే పరిమితమైన సమస్య.. ఇప్పుడు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడిందంటున్నారు న్యాయనిపుణులు. కోర్టు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్సిన నిధులను ఇవ్వలేదని ఆర్టీసీకి కార్మికులు ఆరోపించగా... ప్రభుత్వం రూ.617 కోట్లు ఎక్కువగా నిధులను ఇచ్చామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే సమయంలో 31 శాతం వాట ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేయడంతో.. విచారణ మరి కొన్ని రోజులు జరిగే అవకాశముంది. 24 రోజులుగా కొనసాగుతున్న సమ్మె వ్యవహారం ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అయినా ప్రజల మద్దతు ఎందుకు ఆర్టీసీ కార్మికులకు దక్కడం లేదు అనేది సహజంగానే ఆసక్తిని రేకెత్తించే అంశం.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర వహించారని పేర్కొంటూ..ఆర్టీసీ కార్మికుల సమ్మెకు...టీఆర్ ఎస్ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. ఇవాళ జరిగిన సకల జన భేరి సభకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. సంఘీభావంగా ఆయా పార్టీల నేతలు ప్రసంగించారు కూడా. మరోవైపు, 24 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఉద్యోగంలో కొనసాగడమా - సమ్మెలో కొనసాగడమా అన్నది తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారని ప్రభుత్వ అనుకూల వర్గాలు అంటున్నాయి. ఉద్యమాలు చేయడమే కాదు వాటిని ముగించడంపై స్పష్టత లేకపోవడంతోనే సమస్య ఎదురైందని - ఇంకెంత కాలం ఇలా ఉండాలని పలువురు కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాదిస్తున్నాయి.
అయితే, ఇంతకీ....అన్ని పార్టీలు - ఆర్టీసీ కార్మికులు మద్దతు ఇస్తున్న అంశంలో...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిగా ముందుకు సాగుతున్నారనే విశ్లేషణల నేపథ్యంలో కూడా...ఆర్టీసీ ఆందోళనకు ప్రజల మద్దతు దక్కకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. దీనికి పలువురు ఆసక్తికర కారణాలు పేర్కొంటున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఒకే ఒక డిమాండ్ ను కార్మిక సంఘాలు పట్టుకుని వేలాడడం ఏంటన్నది మొదటి ప్రశ్న. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దశలోనే మొండితనం ప్రదర్శించినా ఆ తర్వాత కొన్ని డిమాండ్ల మీద చర్చలకు సిద్దమని చెప్పినపుడు ఆ ఒక్క అంశంపై సమ్మెను కొనసాగించకుండా...దఫదఫాలుగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చని ప్రజలు భావిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు కొంత వరకు చేయడం వల్ల కూడా ప్రజలు సమ్మెను సీరియస్‌గా తీసుకోవడం లేదంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా....ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాల వల్ల లబ్ధి పొందిన పలు వర్గాలు..ఈ విషయంలో సర్కారీ ఉద్యోగులకు సంఘీభావంగా ముందుకు రావడం లేదంటున్నారు. విపక్షాలన్నీ కేసీఆర్ ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశాయని....కార్మిక సంఘాలను పావులుగా వాడుకుంటున్నాయనే భావన ఉండటమే ప్రజలు మద్దతు దొరక్కపోవడానికి కారణమని...ఓ విశ్లేషకుడు స్పష్టం చేశారు.