Begin typing your search above and press return to search.
లగడపాటి...చాఫ్టర్ క్లోజ్ అయిపోనట్లే
By: Tupaki Desk | 11 Dec 2018 5:55 AM GMTఊరంతా ఒకదారి అయితే.. ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగా ఉన్నది మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీరు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం వస్తుందని సెంటర్ ఫర్ సెఫాలజీ - ఇతర సంస్థలతోపాటు జాతీయ చానళ్ల సర్వేలన్నీ తేల్చి చెప్తుంటే.. లగడపాటి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. అయితే, ఆంధ్రా అక్టోపస్ అంచనా ఫెయిలయింది. విజయవాడ మాజీ ఎంపీ రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ కు విశ్వసనీయతలేదని తేలింది.
ప్రజాఫ్రంట్ గెలుస్తుందని రాజగోపాల్ అసత్య ప్రచారాలు చేశారు. తన ఎగ్జిట్ జోస్యంతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తప్పుడు లెక్కలతో మైండ్ గేమ్ ఆడారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ పాలననే నమ్ముకున్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న కేసీఆర్ కే పట్టం కట్టాలని నిర్ణయించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేయడంలో రాజగోపాల్ దిట్ట అన్న పేరుంది. కానీ తెలంగాణ విషయంలో ఆయన ఆంధ్రా కుటిలత్వాన్ని ప్రదర్శించారు. నైతికంగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. టీఆర్ ఎస్ కు కేవలం 35 సీట్లు వస్తాయని తన పోల్ భవిష్యత్తును వినిపించారు. 65 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. కానీ తెలంగాణ ఓటర్లు తమ విచక్షణను చూపించారు. తెలంగాణ సెంటిమెంట్ లో లోపం లేదని చూపారు. తమ ఓటు హక్కుతో మరోసారి సంచలనం సృష్టించారు. సుస్థిర అభివృద్ధి దిశగా పయనిస్తున్న తెలంగాణపై ఆంధ్రా నేతలు తమ పెత్తనాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నారని లగడపాటి తన సర్వేతో వెల్లడించారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆంధ్రా అక్టోపస్ కు .. తెలంగాణ ఓటర్ల తమదైన శైలిలో ఓటు రుచి చూపించారు.