Begin typing your search above and press return to search.
పరిపూర్ణనంద స్వామికి నగర బహిష్కరణ!
By: Tupaki Desk | 11 July 2018 4:40 AM GMTశ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు.. దానిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో పాటు.. ఆయన తీరును నిరసిస్తూ పాదయాత్ర చేయాలని సంకల్పించిన స్వామి పరిపూర్ణానంద మధ్య చోటు చేసుకున్న వివాదం గురించి తెలిసిందే. ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాద ప్రతివాదనలతో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది.
ఇదిలా ఉంటే.. శ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు ఆయనపై ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ వేటు వేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి వరకూ పాదయాత్ర చేయాలని భావించిన పరిపూర్ణనంద స్వామిని హౌస్ అరెస్ట్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఊహించని రీతిలో స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ లో గృహనిర్బందంలో ఆయన్ను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. నాలుగు వాహనాల్లో బయలుదేరిన తెలంగాణ పోలీసులు పరిపూర్ణానంద స్వామి తరలింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
రెండు వాహనాల్ని విజయవాడ వైపు.. మరో రెండు వాహనాల్ని శ్రీశైలం వైపు పంపారు. ఈ వాహనాల్ని ఎక్కడికి తీసుకెళుతున్న విషయాన్ని వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వామిని కాకినాడకు తరలించినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించలేదు కాదు.. తాజా చర్యతో పరిపూర్ణానంద స్వామిపైన నగర బహిష్కరణ వేటు వేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై పోలీసు వర్గాలు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.