Begin typing your search above and press return to search.
బేబీ వయసుకో రేటు... బ్యూటీకో సూటు.. బామల అందానికో వాట్సాప్ గ్రూపు..!
By: Tupaki Desk | 11 Dec 2022 1:30 AM GMTఅమ్మాయి వయసుకో రేటు... ఆమె బ్యూటీకి సూటయ్యే గది... బేబీల బ్యూటీని బట్టి వారందరికీ ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపు.. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ సెక్స్ రాకెట్ లో వెలుగు చూసిన విస్తుగొలిపే అంశాల్లో ఇవి కొన్ని. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠాను సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచీ యువతలను తీసుకొచ్చి ఇక్కడ హోటళ్లలో వ్యభిచారం చేయిస్తున్న విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. వారి ఫోన్ కాల్ డేటా, నగదు లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో కొన్ని విస్తు గొలిపే అంశాలు వెలుగు చూసినట్లు దర్యాప్తు బృందంలోని ఒక అధికారి తెలిపారు. అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్లతో హైదరాబాద్‌లోని కొన్ని హోటళ్ల సిబ్బంది కుమ్మక్కై ఒక పథకం ప్రకారం ఈ వ్యబిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. కొంతమంది మేనేజర్లు, సిబ్బంది అమ్మాయిల బ్రోకర్లతో చేతులు కలిపి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ విదేశాల నుంచీ యువతలను రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.
విఠులను వీరంతా సెల్‌ఫోన్, వాట్సాప్ కాల్స్ ద్వారానే సంప్రదించి ఆకర్షిస్తున్నారట. ఒక్కో అమ్మాయి వయసును బట్టి ఒక్కో రేటు పెట్టడం, అమ్మాయిల అందాన్ని బట్టి కూడా ఒక్కో రేటు, వ్యభిచారానికి వస్తున్న అమ్మాయి స్థాయిని బట్టి హోటళ్లలో రూములు సూట్‌లు బుక్ చేయడం మొదలు పలు పద్దతలు ఇందులో కొనసాగించారని దర్యాప్తులో తేలింది. విఠుల నుంచీ గూగుల్‌పే, ఫోన్‌పే, ఇతరత్రా మార్గాల్లో డబ్బులు వసూలు చేశారు. అదే పద్ధతిలోనూ వ్యభిచారానికి వచ్చిన యువతులకు వారి బ్రోకర్లకు చేసిన చెల్లింపుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
కొన్ని వేల మంది విఠుల ఫోన్ నెంబర్లు ఈ సెక్స్‌రాకెట్‌లో పట్టుబడిన వారి ఫోన్లలో ఉన్నాయట. వీరిలో దాదాపు 60శాతం మంది ఐటీ రంగానికి చెందిన వారే ఉన్నారట. కొంతమంది పెద్దపెద్ద తలకాయలు కూడా ఈ విఠుల జాబితాలో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు కనుగొన్నారు. పట్టుబడిన నిందితుల నుంచీ మరింత సమాచారం లాగుతున్నారు. హైదరాబాద్ వచ్చిన యువతుల ఫోన్ల వివరాల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో ఉంటూ ఆన్‌లైన్‌ద్వారా హైదరాబాద్‌లో సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా నగరాల పోలీసు కమిషనర్లతో కూడా సంప్రదింపులు జరిపి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఐదురాగుర్ని రాబోయే రెండు మూడు రోజుల్లో అరెస్టు చేయనున్నారని సమాచారం.
ఏడుగురు ప్రధాన నిందితుల ఫోన్లలోని సమాచారం విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒక్కో దాంట్లో నిర్వాహకులతో కూడిన నాలుగు అయిదు వాట్సాప్ గ్రూపులున్నట్లు గుర్తించాం. ఒక్కో గ్రూపులో గరిష్ఠంగా విదేశాలకు చెందిన 400 మంది బ్రోకర్లున్నారు. విఠులను మళ్లీ మళ్లీ ఆకర్షించేందుకు గంజాయి, డ్రగ్స్‌ను యువతుల ద్వారా విఠులకు ఇప్పించేవారు. ముంబాయి చెందిన గుడ్డూ అనే వ్యక్తిద్వారా ఈ ముఠాకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు అందుతున్నాయని పోలీసులు వర్గాలు తెలిపాయి.
ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని హోటళ్ల సిబ్బంది, మేనేజర్లు కూడా కీలక పాత్ర పోషించారు. అరెస్టయిన 18 మందిలో ఇద్దరు హోటల్ మేనేజర్లుండటం దీనికి నిదర్శనం. వ్యభిచారం కోసం ఒక్కో యువతని హోటల్‌కు రప్పించి 10-15 రోజులు హోటల్‌లోనే ఉంచుకుని అక్కడికి విఠులను రప్పించి వ్యభిచారం నిర్వహించేవారు. హోటల్లో ఒక యువత అన్ని రోజులు ఉండి ఆమె వద్దకు విఠులు వచ్చిపోతున్నా అక్కడ సిబ్బంది ఇదేమని ప్రశ్నించేవారు కారని పైగా వారికి అక్కడ సిబ్బంది సహకరించేవారని దద్యాప్తు బృందంలోని ఓ అధికారి అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.