Begin typing your search above and press return to search.

ఛార్జిషీట్ లో శిఖాకు క్లీన్ చిట్?

By:  Tupaki Desk   |   1 May 2019 5:53 AM GMT
ఛార్జిషీట్ లో శిఖాకు క్లీన్ చిట్?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌వాస భార‌తీయుడు.. పారిశ్రామిక‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను తాజాగా నాంప‌ల్లి కోర్టులో దాఖ‌లు చేశారు. ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతంలో త‌న కారులో అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందిన జ‌య‌రాం హ‌త్య పెను సంచ‌ల‌నంగా మారింది. ఈ హ‌త్య కేసులో జ‌య‌రాం మేన‌కోడ‌లు శిఖా చౌద‌రికి ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని తాజా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.

ఇదే విష‌యాన్ని ఏపీ పోలీసులు మొద‌ట చెప్ప‌టం.. దానిపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. ఈ హ‌త్య‌లో కార్మిక సంఘం నేత బీఎన్ రెడ్డి ప్ర‌మేయం ఉన్న‌ట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 300 పేజీలున్న అభియోగ‌ప‌త్రంలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల్ని పేర్కొన్నారు.

ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కూ 8 మందిని అరెస్ట్ చేయ‌గా.. ఈ కేసులోని నిందితుల‌కు స‌హ‌క‌రించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్న ఇద్ద‌రు ఇన్ స్పెక్ట‌ర్లు.. ఒక ఏసీపీపైన వేటు ప‌డింది. జ‌య‌రాం హ‌త్య కేసులో మొద‌ట్నించి అనుమానం ఉన్న ఆయ‌న మేన‌కోడ‌లు శిఖాచౌద‌రికి ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.

జ‌య‌రాం హ‌త్య‌లో ప్ర‌ధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి.. జ‌య‌రాంకు వ్యాపార విష‌యంలో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని.. ఈ క్ర‌మంలోనే రాకేశ్ కు.. జ‌య‌రాం మేన‌కోడ‌లు శిఖాకు ప‌రిచ‌య‌మైన‌ట్లు తేల్చారు. రాకేశ్ రెడ్డి.. శిఖాలు పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా.. అంత‌లోనే వారి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే.. సీసీ కెమేరా పుటేజ్.. కాల్ డేటా ఆధారంగా బీఎన్ రెడ్డి.. జ‌య‌రాం హ‌త్య‌కు రెండు రోజుల ముందు రాకేశ్ రెడ్డి ఇంటికి బీఎన్ రెడ్డి వెళ్ల‌టంతో త్వ‌ర‌లోనే ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.