Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు
By: Tupaki Desk | 29 Nov 2018 5:10 AM GMTఆగర్భ శత్రువులు మిత్రులుగా మారి తెలంగాణలో తొలిసారి కలిసి పర్యటించారు. అధికార టీఆర్ ఎస్ ను ఇరుకునపెడదామని స్కెచ్ గీశారు. కానీ ఖమ్మం సభ ముగియగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్-టీడీపీ కలిసి బుధవారం ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ తొలిసారి పాల్గొన్న రాహుల్ గాంధీ - చంద్రబాబులు ఆ సభ తర్వాత హైదరాబాద్ వచ్చారు. అనంతరం హైదరాబాద్ లో ఓ సభలో పాల్గొన్నారు.
రాత్రి కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షోకు ప్లాన్ చేశారు. కూకట్ పల్లిలో టీడీపీ తరుఫున పోటీచేస్తున్న హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి మద్దతుగా టీడీపీ అధినేత ప్రచారం చేయాలని సిద్ధమయ్యారు. కాగా పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించడం గమనార్హం. ఇందుకు పోలీసులు చెప్పిన కారణం విని చంద్రబాబు షాక్ అయ్యారు.
తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోకు కూకట్ పల్లిలో అనుమతి ఇచ్చామని.. ఒకేరోజు ఇద్దరు రోడ్ షోలకు అనుమతి ఇవ్వడం కుదరదని.. అందుకే చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
పోలీసులు ఇచ్చిన సమాధానంతో చంద్రబాబు - టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తమను టీఆర్ ఎస్ పార్టీ అడ్డుకుంటోందని టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. కాగా ఎలాగైనా కూకట్ పల్లిలో రోడ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాగా గురువారం ఉదయం కూకట్ పల్లిలో సుహాసినికి మద్దతుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు.