Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో :పోలీస్ లాఠీని లాక్కు వెళ్లిన బైక్ వాలా ఎక్కడో తెలుసా?
By: Tupaki Desk | 30 March 2020 4:09 PM GMTకరోనా విజృంభించకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. లాక్ డౌన్ నేపథ్యంలో జనాలు బయటకు రావద్దంటూ ప్రభుత్వాలు ఆదేశించాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కారణం లేకుండా బయటకు వచ్చిన బైక్ వాలాలపై పోలీసులు మొదటి రెండు మూడు రోజులు లాఠీలు కాస్త సీరియస్ గానే జులిపించారు. పోలీసుల లాఠీల దెబ్బలకు ఇద్దరు ముగ్గురు మృతి చెందినట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ విషయంలో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.
ఇక తాజాగా నెట్టింట ఒక వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో పోలీసు వ్యక్తి బైక్ పై వస్తున్న ఇద్దరిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో వారు తప్పించుకునేందుకు బైక్ ను యూ టర్న్ తీసుకున్నారు. అయినా కూడా పోలీసు వ్యక్తి వారిని వెనుక నుండి కొట్టేందుకు ప్రయత్నించాడు. దాంతో బైక్ కు వెనుక పోలీసు లాఠీ చిక్కుకుంది. అయినా కూడా బైక్ వాలా ఆపకుండా అలాగే ముందుకు వెళ్లాడు.
ఆ పోలీస్ వ్యక్తి తన లాఠీని తీసుకునేందుకు పరిగెత్తినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. బైక్ స్పీడ్ కు పోలీసు స్పీడ్ మ్యాచ్ కాలేదు. ఆ కుర్రాళ్లు లాఠీతో ఉడాయించారు. ఆ లాఠిని వారు తిరిగి ఇద్దామనుకున్నా కూడా పోలీసు వారిని కొట్టకుండా ఉండడు అనే భయంతో వారు పరిగెత్తి ఉంటారు అంటున్నారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. తన చేతిలో ఆయుదంను పోగొట్టుకున్న ఆ పోలీసుపై చర్యలు తీసుకోవాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు లో జరిగింది.