Begin typing your search above and press return to search.

స‌క‌ల నేర‌స్తుల స‌ర్వే..ఇది తెలంగాణ పోలీస్ స్పెష‌ల్‌

By:  Tupaki Desk   |   18 Jan 2018 2:30 AM GMT
స‌క‌ల నేర‌స్తుల స‌ర్వే..ఇది తెలంగాణ పోలీస్ స్పెష‌ల్‌
X
తెలంగాణ రాష్ట్ర పోలీసులు వినూత్న స‌ర్వే ఒక‌టి చేప‌ట్ట‌నున్నారు. నేర‌స్తుల వివ‌రాలు అడ‌పాద‌డ‌పా సేక‌రించ‌డానికి భిన్నంగా..ఏకంగా వారి లెక్కతేల్చేందుకు స‌ర్వే మొద‌లుపెట్టారు. దానికి సకల నేరస్తుల సమగ్ర సర్వేగా పేరుపెట్టారు! ఇంతేకాదు....ప్రతి నేరస్తుని సమాచారాన్ని పోలీసులు జియో ట్యాగింగ్ చేయనున్నారు. గతంలో హైదరాబాద్‌లో విజయవంతమైన ఈ సర్వే గురువారం తెలంగాణ వ్యాప్తంగా జ‌ర‌గ‌నుంది!

పోలీస్ అధికారుల‌తో స‌మావేశ‌మైన డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ పనితీరు మెరుగ్గా ఉందన్నారు. టెక్నాలజీని వినియోగించి నేరాలను అదుపు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడిన వెంటనే దొరికిపోతారే భయాన్ని నిందితుల్లో కల్పించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని డీజీపీ కోరారు. రాష్ర్టానికి పెట్టుబడులు అధికంగా రావడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న శాంతిభద్రతల విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉద్దేశంతో నేరస్థుల సమగ్ర సర్వే నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. ఇందులో భాగంగా ప్ర‌తి ఒక్క నేర‌స్తుడి వివ‌రాలు న‌మోదు చేయాల‌ని డీజీపీ సూచించారు. ఇందుకోసం టెక్నాల‌జీ వాడుకోవాల‌ని....నేర‌స్తుల వివ‌రాల‌ను జియో ట్యాగింగ్ ద్వారా స‌మీకృతం చేయాల‌ని సూచించారు.