Begin typing your search above and press return to search.
తిరుమలలో తెలంగాణ రాజకీయం
By: Tupaki Desk | 23 Dec 2022 6:30 AM GMTతెలంగాణలో ఎక్కడ మీటింగ్ పెట్టినా.. చీమ చిటుక్కుమన్నా కేసీఆర్ ఏర్పాటు చేసిన వేగులు పట్టేస్తాయి. తెలంగాణలో నాటి సీఎం చంద్రబాబును, రేవంత్ రెడ్డి లాంటివారినే వీడియోలో ఓటుకు నోటు కేసులో బుక్ చేసి సాగనంపిన చరిత్ర కేసీఆర్ ది. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ ఏజెంట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలును పట్టించి అందరికీ షాకిచ్చాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇప్పుడు తెలంగాణలో ఫుల్ నిఘా ఉంది.
అందుకే ఇటీవల మేడ్చల్ జిల్లా చుట్టుపక్కల ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు భేటి కావడం బీఆర్ఎస్ లో కలకలం రేపింది. వీరి భేటి లీక్ అయ్యి కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే పార్టీ అధిష్టానం ఇంతవరకూ వారిని పిలిపించి ఏం జరిగింది? ఏమిటీ అనే విషయాన్ని మాత్రం చర్చించలేదు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఈ ఐదుగురు అసమ్మతి రాజేశారు.
తెలంగాణలో ఎక్కడ భేటి జరిగినా కేసీఆర్ కు తెలిసిపోతుందని భావించిన ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం పేరిట ఏపీకి వచ్చేశారు. దేవుడి దర్శనం చేసుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బండ ప్రకాష్ గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తిరుమలకు కలిసికట్టుగా వెళ్లి భక్తి పేరిట రాజకీయం మొదలుపెట్టారు. ఈ ఐదుగురు కొండపైనే మరోసారి భేటి కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే తెలంగాణలో భేటి అయిన వీరిని కేసీఆర్ ఏమీ అనలేదు. పిలిచి మాట్లాడలేదు. కేవలం మల్లారెడ్డి ఈ వివాదాన్ని పరిష్కరిస్తానన్నారు. కానీ పిలిచి మాట్లాడలేదు. దీంతో అలకబూనిన వీళ్లంతా తెలంగాణలో మళ్లీ కలిస్తే కేసీఆర్ పసిగడుతారని తిరుమల వెళ్లారు. 19న మైనంపల్లి ఇంట్లో సమావేశమైన వీరంతా తిరుమలలో తెలంగాణ రాజకీయం షురూ చేశారు.
అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. కేసీఆర్ ఉండగా మల్లారెడ్డిని తీసివేయడని వారందరి గట్టి నమ్మకం. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు కష్టమే.
ఇక రెండు సార్లు గెలిచిన గులాబీ పార్టీలో మూడో సారి గెలుపు చాలా కష్టం. అందుకే వీరు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని.. ఏపీలో అంతగా నిఘా ఉండదు కాబట్టి అక్కడ బీజేపీ పెద్దలతో రాయబారాలు సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇది నిజమా? పార్టీ మారుతారా? కేసీఆర్ పై అసమ్మతి రాజేస్తారా? అన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.