Begin typing your search above and press return to search.

ఆ నలుగురు సేఫ్.. మిగిలిన వారికి కేసీఆర్ చేతులో చిక్కులేనా?

By:  Tupaki Desk   |   29 Oct 2022 6:37 AM GMT
ఆ నలుగురు సేఫ్.. మిగిలిన వారికి కేసీఆర్ చేతులో చిక్కులేనా?
X
కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే పరిణామాలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితే నెలకొందంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన బీజేపీ మధ్యవర్తుల ఉదంతం.. రివర్సులో వారినే చిక్కుల్లో పడేలా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

బీజేపీ మధ్యవర్తులు విసిరిన వలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిక్కటం.. దానికి సంబంధించిన సంప్రదింపుల విషయాన్ని స్మెల్ చేసిన కేసీఆర్ అండ్ కో.. అలెర్టు అయిపోయి.. తనకు ఎసరపెట్టే వారిని గుర్తించినట్లుగా చెబుతారు.

అనుకోని రీతిలో అధినేతకు దొరికిపోవటంతో.. రివర్సు ఇంజనీరింగ్ లో ఎవరైతే దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశారో వారికే ఎదురుదెబ్బ తగిలేలా చేసే వ్యూహాన్ని పన్నిన కేసీఆర్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అయినట్లు చెబుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎరకు రెఢీ అయి.. చివరకు కేసీఆర్ తో రాజీ చేసుకున్న ఆ నలుగురు ఇప్పుడు సేఫ్ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నలుగురికి తప్పనిసరిగా ప్రమోషన్ గ్యారెంటీ అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేలకు ఎర వేసే విషయంలో కీలక్ంగా వ్యవహరించిన వారిలో ఒకరైన నందూకు చెందిన డైరీ ఒకటి ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కింది.

అందులో యాభైకు పైగా పేర్లు ఉండటం.. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతల వివరాలు ఉండటం తెలిసిందే. టీఆర్ఎస్ తో పాటు.. కాంగ్రెస్ కు చెందిన వారిని కూడా జాబితాను మొయింటైన్ చేయటం.. అది కాస్తా ఇప్పుడు కేసీఆర్ వరకు వెళ్లటంతో.. తప్పు చేయటానికి సిద్ధమైన వారు కాస్తా సేవ్ అయితే.. డైరీలో ఉన్న కొత్త పేర్లల్లోని వారికి మాత్రం తిప్పలు తప్పవంటున్నారు.

దీనికి కారణం.. ప్రభుత్వాన్ని పడేసేందుకు అవసరమైన సరంజామాను బీజేపీ అండ్ కో సిద్ధమవుతుంటే.. దానికి అవసరమైన ఇంధనాన్ని తమ వారే ఇవ్వటాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటారని చెబుతున్నారు. అందుకే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకమైన ఆ నలుగురికి ప్రమోషన్ ఇవ్వటం ద్వారా విధేయతకు పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పి.. మిగిలిన వారి విషయంలో కఠినంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఆ నలుగురు సేఫ్ గా బయటపడిపోగా.. డైరీలో పేర్లు ఉన్న వారికి మాత్రం తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.