Begin typing your search above and press return to search.

పేదరికంలో తెలంగాణకు 18వ ర్యాంక్

By:  Tupaki Desk   |   27 Nov 2021 2:30 PM GMT
పేదరికంలో తెలంగాణకు 18వ ర్యాంక్
X
దేశంలో పేదరికం లెక్కలు తెలిశాయి. బిహార్ దేశంలోనే అత్యంత పేద రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు నీతి అయోగ్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల స్థానాలు కూడా తేలిపోయాయి. దేశంలో పేదరికంపై నీతి అయోగ్ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లు అత్యంత పేద రాష్ట్రాలుగా అవతరించాయి. ఈ మేరకు విడుదల చేసిన మల్టీ డైమన్షల్ పార్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా పలు వివరాలు వెల్లడయ్యాయి.

దేశంలోని బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా నిలిచింది. బీహార్ లో సగానికి పైగా (51.91శాతం) మంది పేదరికంలో మగ్గుతున్నట్టు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాతి స్థానంలో ఝార్ఖండ్ ఉన్నట్టు తెలిపింది.

ఝార్ఖండ్ లో 42.16 శాతం మంది పేదలని తెలిపింది. 37.79శాతం పేదలతో ఉత్తర ప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్టు నీతి అయోగ్ వెల్లడించింది. 36.65శాతం మంది పేదలతో మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో.. 32.67శాతం మంది పేదలతో మేఘాలయ ఐదు స్థానంలో ఉంది.

ఇక పేదలు అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఈ రాష్ట్రంలో కేవలం 0.71శాతం మంది మాత్రమే అత్యంత పేదలున్నారు. ఆ తర్వాతి స్థానంలో గోవా (3.76శాతం), సిక్కిం (3.82శాతం), తమిళనాడు (4.89శాతం), పంజాబ్ (5.59శాతం) ఉన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ జనాభాలో 13.74శాతం మంది పేదలు ఉన్నట్టు నివేదికలో తేలింది. నీతి అయోగ్ నివేదికలో తెలంగాణ దేశంలో 18వ స్థానంలో నిలిచింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో 12.31శాతం మంది పేదరికంలో మగ్గుతున్నట్టు తెలిపింది. ఏపీ ర్యాంక్ దేశంలో 20వ గా ఉంది.