Begin typing your search above and press return to search.
ప్రాణభిక్ష పెట్టు కేసీఆర్ అన్నా! ఫ్రీ అన్నావ్.. డబ్బులకు వైద్యం అందట్లేదు జగనన్నా!
By: Tupaki Desk | 11 May 2021 4:33 AM GMTఏపీకి చెందిన కరోనా రోగులు.. అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ కు అంబులెన్సుల్లో వస్తుంటే.. అలాంటి వారిని అధికారులు అడ్డుకున్న వైనం.. రెండు రాష్ట్రాల మధ్య పెను గందరగోళానికి దారి తీసింది. అంబులెన్సుల్లో వచ్చే వారంతా.. వారి పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ.. ఎవరు తీసుకున్నారో తెలీని నిర్ణయాన్ని.. అధికారులు అమలు చేయటం పలువురు రోగులకు ప్రాణసంకటంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే అన్ని సరిహద్దుల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో.. ఎంతోమంది ఆవేదనకు గురి కాగా.. మరికొందరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతులెత్తి వేడుకోవటం కదిలించింది వేసింది.
తమకు ఆడ్మిషన్లు ఇచ్చేందుకు ఆయా ఆసుపత్రుల నుంచి అనుమతి పొందినప్పటికి.. అందుకు అంగీకరిస్తూ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినప్పటికి.. అధికారులు ససేమిరా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉదంతం పలువురిని కదిలించివేసింది. అనంతపురానికి చెందిన కొవిడ్ బాధితుడు ఈశ్వర్ రెడ్డి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆయన జియాలజిస్టుగా పని చేస్తుంటారు. కోవిడ్ సోకింది. అత్యవసర వైద్యానికి హైదరాబాద్ వస్తున్నారు. ఒక ఆసుపత్రిలో ఆయనకు వైద్యం చేయటానికి అనుమతిస్తూ ఉన్న పత్రాలు వారి వద్ద ఉన్నాయి.
కానీ.. వారు ప్రయాణిస్తున్న అంబులెన్సును ఉన్నపళంగా పుల్లూరు వద్ద ఆపేశారు. పెద్ద వయస్కుడైన భర్త వెంట.. ఆమె సతీమణి మాత్రమే ఉన్నారు. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎవరు ఆమె మాటల్ని పట్టించుకోని పరిస్థితి. దీంతో.. కనిపించిన వారందరికి చేతులు జోడించి.. ఇలా ఆపేస్తారని తమకు తెలీదని.. తన భర్త ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని.. హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకునే హక్కు ఉందని పేర్కొంటూనే.. అన్నా కేసీఆర్.. నా భర్తకు ప్రాణదానం చేయండన్నా అంటూ విలపించారు.
మరోవైపు అనంతపురంలో వెంటిలేటర్లు లేవని.. ఆక్సిజన్ దొరకటం లేదని వాపోయారు. అన్ని ఉచితంగా ఇస్తానంటున్నావు.. డబ్బు పెట్టినా ఇప్పుడు వైద్యం లభించట్లేదు.. కేసీఆర్ తో మాట్లాడండి జగనన్నా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నా.. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు. మా గోడును ఆలకించడంటూ ఆవేదన వ్యక్తం చేసిన వైనం పలువురిని కదిలించి వేసింది. చివరకు ఆమెకు హైదరాబాద్ ఆసుపత్రిలో బెడ్ అలాట్ అయిన పత్రాలకు స్థానిక అధికారులు ఓకే చెప్పటంతో వారు ప్రయాణించిన అంబులెన్సు ముందుకు కదిలింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో తెలంగాణ సరిహద్దుల్లో సోమవారం కనిపించింది.