Begin typing your search above and press return to search.
తెలంగాణ కల్లోలం: ఒక్కరోజే 206 కేసులు, పది మంది మృతి
By: Tupaki Desk | 7 Jun 2020 12:31 PM GMTమహమ్మారి వైరస్ తెలంగాణలో కల్లోలం సృష్టిస్తోంది. ఏకంగా ఒక్కరోజే గతంలో ఎన్నడు లేని విధంగా 206 కేసులు నమోదు కాగా, 10 మంది మృత్యువాత పడ్డారు. శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ను చూసి ప్రజలందరూ షాక్‌కు గురయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 3,496కి చేరుకున్నాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ వైరస్‌తో 123 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రంగారెడ్డి 10, మేడ్చల్ 18, నిర్మల్ 5, యాదాద్రి 5, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌లో రెండు చొప్పున, మహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కో కేసు నమోదైంది.
తెలంగాణలో మొత్తం 1,710 మంది డిశ్చార్జ్ కాగా 1,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే వైరస్ విషయంలో పరిస్థితి చేయి దాటేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టెస్టుల సంఖ్య పెంచుతామని చెప్పిన మరుసటి రోజే కేసులు భారీగా నమోదు కావడం విశేషం. అంటే ఇన్నాళ్లు టెస్టులు చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.