Begin typing your search above and press return to search.
సమ్మెపై హైకోర్టుకు ఆర్టీసీ ఎండీ సంచలన అఫిడవిట్
By: Tupaki Desk | 17 Nov 2019 4:58 AM GMTఉమ్మడి రాష్ట్రంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇంతకు ముందెప్పుడూ లేని రీతిలో సుదీర్ఘకాలం పాటు సాగిన ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్ కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలభై రోజులకు పైనే సాగుతున్న సమ్మె అంశంపై తాజాగా ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో సంచలన అంశాల్ని ప్రస్తావించారు.
ఆర్టీసీ సమ్మె వెనుక భారీ కుట్ర ఉందని పేర్కొన్న ఎండీ సునీల్ శర్మ.. భారీ ఆరోపణలకు తెర తీస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వెనుక కొన్ని అదృశ్య శక్తులు పని చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కార్మికులు.. యాజమాన్యం.. ప్రజల పాత్ర లేకున్నా వారు సమ్మె కారణంగా మూల్యం చెల్లిస్తున్నారన్న ఆయన.. ఇప్పుడు కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరటానికి ముందుకు వచ్చినా.. వారిని తిరిగి విధుల్లో కొనసాగించే విషయంపై నిర్ణయం తీసుకోవటం యాజమాన్యానికి ఇబ్బందిగా మారిందంటూ పేర్కొన్న అంశం సంచలనంగా మారింది.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలన్నారు. యూనియన్ నాయకులు కొందరు తమ ఉనికి కోసం మొత్తం ఆర్టీసీ కార్మికులను కష్టాల్లోకి నెడుతున్నారని.. ప్రతిపక్ష నేతలతో కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు.
అఫిడవిట్ లో పేర్కొన్న సంచలన అంశాల్ని చూస్తే..
% యూనియన్ నాయకులు తమ పలుకుబడి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సమ్మెను ఎంత మాత్రం
ప్రోత్సహించకూడదు. సమ్మె చేస్తున్న కార్మికులు.. తమ హక్కులు.. డిమాండ్లను సాధించుకోలేరు.
% యూనియన్ నేతలు.. ప్రతిపక్షాలు అధికారుల్ని భయపెడుతున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారు. క్రమశిక్షణ గాడి తప్పింది. ఉన్నతాధికారుల్ని లెక్క చేయటం లేదు.
% కార్మికుల ఇష్టాయిష్టాలకు వదిలి పెడితే విపరీత పరిస్థితులకు దారి తీస్తుంది. క్రమశిక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక యాజమాన్యంగా సొంత సిబ్బందినే శిక్షించాలనే ఉద్దేశం లేదు. కానీ.. పరిస్థితులను దారికి తేవటానికి కఠినంగా వ్యవహరించక తప్పదు.
% కార్మికులపై ఆర్టీసీకి ఎలాంటి శతృత్వం లేదు. సంస్థ నష్టాల్లో ఉన్నా ఉద్యోగులకు 44 శాతం జీతాల పెంపు.. 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే సాధ్యం కాని డిమాండ్ తో పాటు మరిన్ని డిమాండ్లతో కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మె నోటీసు ఇచ్చి.. దసరా నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు.
% దసరా సందర్భంగా లాభాలు ఆర్జించాలని యాజమాన్యం భావిస్తే.. కార్మికులు సమ్మెకు దిగారని.. దీంతో సంస్థ మరింత నష్టాల్లోకి కూరుకుపోయిందన్నారు. యూనియన్ నేతలు విలీన అంశాన్ని పక్కన పెట్టి మిగిలిన వాటిపై చర్చలకు సిద్ధమంటున్నారు.కానీ.. వారు ఇప్పటికి విలీన డిమాండ్ నుంచి పూర్తిగా వైదొలగలేదు.
% లెక్కలు తీస్తే ఇతర ప్రభుత్వ సంస్థలు.. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెలే ఎక్కువగా ఉంటాయి. సమ్మెను కార్మికుల ఇష్టాయిష్టాలకు వదిలేస్తే.. ఎప్పుడు చేరితే అప్పుడే చేరండని డోర్లు తెరిచిపెడితే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితే మిగిలిన సెక్టార్లలోని ఉద్యోగులు చేస్తే.. పారిశ్రామికాభివృద్ధికి అడ్డు అవుతుంది.