Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాన‌స పుత్రిక‌.. రాజ‌కోట‌ను త‌ల‌పిస్తున్న తెలంగాణ సెక్ర‌టేరియెట్!

By:  Tupaki Desk   |   18 Nov 2022 12:30 AM
కేసీఆర్ మాన‌స పుత్రిక‌.. రాజ‌కోట‌ను త‌ల‌పిస్తున్న తెలంగాణ  సెక్ర‌టేరియెట్!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాన‌స పుత్రికగా భావిస్తున్న రాష్ట్ర నూత‌న స‌చివాల‌యం.. రాజ‌ద‌ర్బా ర్‌ను .. రాజ‌కోట‌ను త‌ల‌పిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా సీఎం కేసీఆర్‌.. ఇక్క‌డ ప‌ర్య‌టించారు. దీంతో దీనికి సంబంధించిన‌ ఫ‌స్ట్ ఫొటో ఒక‌టి విడుద‌ల అయింది. అయితే, ఇది అధికారికం ఏమీ కాదు. ఇక‌, నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం స్వ‌యంగా పరిశీలించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, అధికారులు, ఇంజినీర్లు సచివాలయానికి వెళ్లి పనులు పరిశీలించారు. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం భవనం ముందుభాగంలో ఎలివేషన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భవనం లోపల కలియతిరిగిన సీఎం కేసీఆర్‌ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.

తొలుత 6 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించినా ప్రస్తుతం అది 8.60 లక్షల చదరపు అడుగులకు చేరింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారు. 2019 జూన్‌లో సచివాలయ నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నమూనాలు సిద్ధమై తొలి స్లాబు వేసేందుకు 2021 జనవరి అయింది.

కరోనా కారణంగా నాలుగు నెలల పాటు ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. ఆ తరవాత నుంచి పనుల వేగాన్ని పెంచారు. అన్ని అంతస్తుల్లోనూ పనులు ఒకేసారి జరిగేలా రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రణాళికను రూపొంచడంతో పాటు పనుల తీరు తెన్నులను రోజువారీగా సమీక్షిస్తున్నారు. త్వరలో భవన ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది రాజ‌మ‌హ‌ల్‌ను పోలి ఉండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.