Begin typing your search above and press return to search.

అదానీ చేతికి తెలంగాణ సోలార్ యూనిట్

By:  Tupaki Desk   |   21 March 2021 6:30 AM GMT
అదానీ చేతికి తెలంగాణ సోలార్ యూనిట్
X
గత ఏడాది కాలంలో.. కరోనా కల్లోలంలో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరులైన అమేజాన్ బెజోస్, టెస్లా ఎలన్ మస్క్ లను మించి ఆదాయాన్ని సంపాదించిన దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ తాజాగా తెలంగాణలోనూ అడుగుపెట్టాడు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఉన్న ఆయన తెలంగాణలో సౌరవిద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును చేజిక్కించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కంపెనీకి దక్కింది. అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) ఈ మేరకు ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది.

ప్రాజెక్టును చేజిక్కించుకున్న అదానీ కంపెనీ టొరంటో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్కైపర్ గ్లోబల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రాజెక్ట్ ను నిర్వహిస్తున్న స్పెషల్ పర్పస్ వెహికల్ లో 100శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ సంస్థ తెలిపింది.

ఇక ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ కొంటుంది.