Begin typing your search above and press return to search.
ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల అప్పు పెరిగి పోయిందిగా సారూ?
By: Tupaki Desk | 9 March 2020 5:01 AM GMTగొప్పలు చెప్పటం వేరు. గొప్పగా ఉండటం వేరే. అలానే మేధావి పాలకుడిగా వ్యవహరిస్తున్న వేళ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బేషుగ్గా ఉంటుందని భావిస్తారు. ఎందుకంటే.. తెలివిలో తోపులాంటి వ్యక్తి ఉన్న దానికి తగ్గట్లే.. ఆదాయం పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు.. సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేస్తే తిరుగు ఉండదు. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందంటున్నారు.
గడిచిన ఐదేళ్ల వ్యవధి లో రాష్ట్ర అప్పు భారం అంతకంతకూ పెరుగుతున్న వైనం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. మిగులు బడ్జెట్ కాస్తా.. ఆరేళ్ల వ్యవధిలో అప్పుల కుప్పగా మారిందన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా బడ్జెట్ సందర్భంగా బయటకు వచ్చిన అధికారిక సమాచారం ఆ విషయాన్ని ధ్రువీకరిస్తుండటం గమనార్హం.
2016 - 17లో రూ.1.29 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే.. ఈ ఏడాదికి రూ.2.29లక్షల కోట్ల మేర అప్పులు పెరిగిన వైనం చూస్తే.. ఐదేళ్ల వ్యవధిలో రూ.లక్ష కోట్ల మేర పెరిగిన వైనం విస్తు పోయేలా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్ని పరిశీలిస్తే.. బహిరంగ మార్కెట్లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్న వైనం కనిపిస్తుంది.
2016-17లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.29లక్షల కోట్ల అప్పు ఉంటే.. తాజా లెక్కల్ని చూస్తే.. దానికో లక్ష కోట్ల రూపాయిలు అదనంగా చేరటం విస్తుపోయేలా చేస్తుందని చెప్పాలి. ప్రతి ఏటా సరాసరిన రూ.20 నుంచి రూ.22 వేల కోట్ల మేర అప్పులు తీసుకుంటున్న వైనం చూసినప్పుడు.. రానున్న రోజుల్లో ఈ భారం మరెంత పెరుగుతుందన్నది అర్థం కానిదిగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.