Begin typing your search above and press return to search.

తెలంగాణలో నిషేధం లేదు కానీ నోటీసులు..!

By:  Tupaki Desk   |   10 Jun 2015 5:42 AM GMT
తెలంగాణలో నిషేధం లేదు కానీ నోటీసులు..!
X
పరిమితికి మించి హానికారక రసాయనాలు వాడినట్లు పలుచోట్ల తేలిని మ్యాగీ న్యూడిల్స్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నిషేధం ఉండదని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.

తాము జరిపిన నాణ్యత పరీక్షల్లో హానికారక రసాయనాలు ఉన్నట్లు తేలని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పలు రాష్ట్రాల్లో మ్యాగీని బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవటం.. పలు చోట్ల నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో హానికారక రసాయనాలు వాడినట్లు నిరూపితం కావటం లాంటి పరిణామాల నేపథ్యంలో తమ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మ్యాగీ ఉత్పత్తిదారు నెస్లే ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మ్యాగీపై ఎలాంటి నిషేధం లేదని తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. అయితే.. మ్యాగీ న్యూడిల్స్‌ పాకెట్‌ మీద ఎస్‌ఎంజీ కలపలేదని పేర్కొనటం.. అందుకు భిన్నంగా ఎస్‌ఎంజీ ఉన్నట్లు తేలటంతో.. తప్పుడు సమాచారం ఇచ్చిన అంశంపై కంపెనీకి సంజాయిషీ కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. తప్పుడు సమాచారం ముద్రించి.. ప్రజల్ని తప్పుదారి పట్టించిన ఉత్పత్తులపై నిషేధం విధించటంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎందుకు వెనకడుగు వేస్తుందో..?