Begin typing your search above and press return to search.
కావూరికి చుక్కలు చూపిస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 18 Jan 2016 4:04 PM GMTఅదును చూసి దెబ్బకొట్టడం, అభయం కోరిన వారిని రక్షించడంలో ముందుండే తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇపుడు మరోమారు తన పాచికను విసిరారు. ఈ దఫా తన లక్ష్యసాధనకు సైందవుల్లా అడ్డుపడిన వారిని కేసీఆర్ టార్గెట్ చేశారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న సీమాంధ్ర నేతలు కావూరి సాంబశివరావు - లగడపాటి రాజగోపాల్ - రాయపాటిలు తమ నినాదం కోసం పోరాడారు. అయితే రాష్ర్టం విడిపోయిన తర్వాత వారిలో రాయపాటి - లగడపాటి స్టాండ్ మార్చారు. రాయపాటి టీడీపీలో చేరి వీలైనంత వరకు విభజనపై నోరు మెదపడం లేదు. లగడపాటి అయితే తెలంగాణ ప్రభుత్వం గురించి పల్లెత్తుమాట అనడం లేద సరికదా...12 ఏళ్లకోమారు వచ్చే పుష్కరాలకు సతీసమేతంగా తెలంగాణలో హాజరయ్యారు. కావూరి బీజేపీలో చేరి వీలైనపుడల్లా విభజనపై తన భావాలు తెలియజేస్తున్నారు.
అయితే ఈ తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. తన స్పందనను నేరుగా తెలియజెప్పకుండా కావూరికి పొగపెడ్తున్నారు. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ ద్వారా కావూరిపై వేట మొదలుపెట్టారు. ఆయనకు చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్లో కోట్లలో భాకీ పడింది. దీంతో ఆస్తులను వేలం వేస్తావని నోటీసులు ఇచ్చారు. నోటీసులే కావూరికి తలనొప్పి అనుకుంటే కావూరి వ్యక్తిగత అంశాలు మరింత ఇబ్బందిగా మారాయి. కావూరి తన వ్యాపార అవసరాల రీత్యా కంపెనీలను ఒకేసారి వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టారు. ఈ క్రమంలో అనేక తప్పుడు వివరాలను అందజేశారు. ఈ పరిణామాలపై బ్యాంకులు ఫుల్లుగా ఫైరయ్యాయి. ఒకే ఆస్తులతో ఇన్ని బ్యాంకులో ఎలా అని హెచ్చరిస్తూ ఆస్తులను తనఖా పెట్టుకున్నాయి.
ఈ పరిణామాలపై కావూరి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో తనఖా ప్రక్రియ ఇలా ఉండగానే ఏవిధంగా నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల వివాదం సద్దుమణిగిన తర్వాత తాము చెల్లిస్తామని చెప్పారు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా ఫిబ్రవరీ పదిలోగా సమస్యను సెటిల్ చేసుకోవాలని సూచించింది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే...లగడపాటి లాగే కావూరి కూడా కేసీఆర్‌ను ఆశ్రయిస్తారా? లేకపోతే పన్నులు కట్టేస్తారా అనేది తేలాల్సి ఉంది.