Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలంగాణ విద్యార్ధి మృతి
By: Tupaki Desk | 6 Dec 2017 2:43 PM GMTభవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్నత విద్యనభ్యసించడం కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థి నాగ తులసిరామ్(26) దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో తులసిరామ్ చనిపోయినట్లు ఫోన్ వచ్చిందని అతడి తండ్రి జాకబ్ తెలిపారు. కుత్భుల్లాపూర్ సర్కిల్ సూరారంకు చెందిన జాకబ్ కుమారుడు తులసిరామ్ యూఎస్ ఏలోని బ్రిడ్జిపోర్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. రెండు సంవత్సరాలుగా తులసి రామ్ అమెరికాలో ఉంటున్నాడు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్నకొడుకు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అమెరికాలోని వాటర్ బరీలో తన కుమారుడు నివాసం ఉండే వాడని జాకబ్ చెప్పారు. చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకు హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు వెళ్లడం తమను కుంగదీసిందన్నారు. తన కుమారుడి ఆచూకీ కనుగొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేయాలని జాకబ్ కన్నీటిపర్యంతమై విజ్ఞప్తి చేశారు. తన కుమారుడి పార్ధివ దేహాన్ని హైదరాబాద్ కు తెప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఆయన విన్నపం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ ను జాకబ్ కలిసి ఈ ఘటన వివరాలు చెప్పారు. మంత్రి కేటీఆర్ దృష్టికి వివేక్ ఈ విషయం తీసుకుళ్లారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.