Begin typing your search above and press return to search.

జార్జియాలో విషమ పరిస్థితిలో తెలంగాణ విద్యార్థి

By:  Tupaki Desk   |   19 March 2020 5:00 AM GMT
జార్జియాలో విషమ పరిస్థితిలో తెలంగాణ విద్యార్థి
X
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని జార్జియాలో చిక్కుకుపోయి అష్టకష్టాలు ఎదుర్కొంటోంది. భువనగిరికి చెందిన వెంకటేశ్-సరిత దంపతుల కూతురు శివాణి పైచదువుల కోసం జార్జియా దేశం వెళ్లింది. స్థానిక అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసన్ చదువుతోంది.

కాగా శివాణి కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చేసుకొని అపస్మారస్థితిలోకి వెళ్లింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శివాణి బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వెంటనే శివాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

శివాణికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులను శివాణీ తల్లిదండ్రులు సంప్రదించారు. వారు ఓకే అనడంతో శివాణిని భారత్ కు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే జార్జియా నుంచి భారత్ కు పంపేందుకు ఎయిర్ పోర్టు సిబ్బంది చివరి నిమిషంలో శివాణికి నో చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురును ప్రభుత్వాలు స్పందించి ఇండియాకు తీసుకురావాలని కోరుతున్నారు.