Begin typing your search above and press return to search.
యూరోప్ లో మనోడి సూసైడ్
By: Tupaki Desk | 22 Nov 2017 4:58 AM GMTకారణం ఏమిటన్నది స్పష్టత రాలేదు కానీ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఒక యువకుడు అక్కడే ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా శంకపట్నం మండలం చింతగుట్టకు చెందిన ఓరుగంటి ప్రశాంత్ రెడ్డి (23) ఉన్నత విద్య కోసం ఈ ఏడాది జనవరిలో యూరోప్ వెళ్లారు.
మెకానికల్ ఇంజనిరీంగ్ కోర్సు చేస్తున్న అతడు.. కనూలుష్ టెక్నికల్ యూనివర్సిటీలో మేనేజ్ మెంట్ మెకానికల్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ నెల 19 రాత్రి తాను ఉండే ఇంట్లోని బాత్ రూంలో ఊరేసుకొని సూసైడ్ చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. చింతగుట్ట గ్రామానికి చెందిన ఓరుగంటి రాజిరెడ్డి.. భాగ్యమ్మ కుమారుడు ప్రశాంత్ రెడ్డి. చదువుకోవటానికి వెళ్లిన ఈ యువకుడు సూసైడ్ ఎందుకు చేసుకున్నాడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కొడుకు ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జిల్లా వాసి ఆత్మహత్య విషయంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఇమ్రిగ్రేషన్ అధికారులతో మాట్లాడారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఎంపీ వినోద్ కుమార్ పై మృతుడు బంధువులు కోరుతున్నారు. వారు కోరుతున్న విధంగా ప్రశాంత్ రెడ్డి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నత చదువులతో మరింత ఉన్నత స్థానాలకు ఎదుగుతాడనుకున్న తమ కొడుకు మృతిని ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.