Begin typing your search above and press return to search.

కావాల్సింది ఉద్యోగాలు.. ఎస్సెమ్మెస్‌లు కాదు!

By:  Tupaki Desk   |   14 April 2015 10:30 PM GMT
కావాల్సింది ఉద్యోగాలు.. ఎస్సెమ్మెస్‌లు కాదు!
X
ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలి. అంతే కానీ, మీ ఇంటికి బియ్యం పంపినప్పుడు నీ మొబైల్‌కు ఎస్సెమ్మెస్‌ పంపిస్తామని చెబితే వాడికి ఆకలి తీరుతుందా!? పైగా ఆ ఆకలిలో కోపం మరింత పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలోని నిరుద్యోగుల పరిస్థితి కూడా ఇంతే!

తెలంగాణలోని నిరుద్యోగులు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కోరుతున్నారు. వాటి కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజూ పేపర్లు చూస్తున్నారు. కోచింగ్‌ సెంటర్లలో ప్రిపేర్‌ అవుతున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మేం నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు మీ మొబైల్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపిస్తామని, అందుకు మీరు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచిస్తోంది. నిజానికి, ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తోందంటే ముందుగానే పత్రికల్లో కథనాలు వస్తాయి. ఎక్కడికక్కడ హడావుడి ఉంటుంది. నోటిఫికేషన్లు వస్తే ఆ సమాచారాన్ని నిరుద్యోగులు ఏదో విధంగా తెలుసుకుంటారు. అది తెలియకుండా ఉండే విషయమూ కాదు.

ఇప్పుడు ప్రభుత్వం కానీ టీఎస్‌పీఎస్‌సీ కానీ ఇవ్వాల్సింది ఉద్యోగాలకు నోటిఫికేషన్లని, అంతే తప్పితే అవి వచ్చినప్పుడు ఎస్సెమ్మెస్‌లు ఇస్తామనే ప్రకటనలు తమకు అవసరం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాలి కానీ ఏడాది తర్వాత నీకు బిర్యానీ వస్తుందంటూ సమాచారం ఇస్తే ఏం ఉపయోగమని విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ చర్యలను తప్పుడుతున్నారు.