Begin typing your search above and press return to search.
తెలంగాణ విద్యార్థులకు ఎంత కష్టం?
By: Tupaki Desk | 15 Sep 2015 5:30 PM GMTతెలంగాణ ప్రభుత్వం విధించే నిబంధనలతో నిజానికి తెలంగాణ విద్యార్థులే ఇబ్బందులు పడుతున్నారు. స్థానికత విషయంలో ఎక్కువగా తెలంగాణ విద్యార్థులకే కష్టాలు ఎదురవుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అని స్పష్టం చేసింది. సందేహాలకు తెరదించింది. కానీ, మరో కొత్త వివాదం ప్రారంభం కానుంది.
నిజానికి, స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేసిన పిల్లిమొగ్గలతో విద్యార్థులు పూర్తి స్థాయిలో నిరాశకు గురయ్యారు. అయితే, ఇప్పుడు దీనికి ముగింపు పలికింది. ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అని తేల్చి చెప్పింది. అంటే పదో తరగతికి ముందు నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఇంటర్ కు అది స్థానికత అని, ఇంటర్ నుంచి కిందికి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అది ఆపై కోర్సుల స్థానికత అని తేల్చి చెప్పింది.
అయితే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక పరిణామం చాలా తీవ్రస్థాయిలో జరిగింది. తెలంగాణలో బందుల కారణంగా పాఠశాలలు జరగని పరిస్థితి. విద్యార్థులు కూడా ఉద్యమంలోకి వస్తుండడంతో తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందారు. దాంతో తమ పిల్లలను సీమాంధ్రలోని విద్యా సంస్థలకు పంపేశారు. వారంతా పదో తరగతి కొంతమంది, ఇంటర్మీడియెట్ కొంతమంది గుంటూరు - విజయవాడ - పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో చదువుకున్నారు. ఆ తర్వాత తాము తెలంగాణలో పుట్టాం కనక తమకు తెలంగాణ స్థానికత వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో వారంతా కంగు తింటున్నారు. ఇటువంటి వాళ్లు తెలంగాణలో పాతిక వేలకుపైనే ఉంటారని అంచనా.
స్థానికత అనే కత్తిని ముట్టుకున్న కేసీఆర్ కు ఎదురు దెబ్బలు తప్పడం లేదని, ఈ విషయంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.