Begin typing your search above and press return to search.
టీడీపీకి ఎలాగూ ఓటేయలేదు..కుంటిసాకులైనా వినండి
By: Tupaki Desk | 12 Dec 2018 5:30 PM GMTలగడపాటి ట్రాక్ రికార్డు పుణ్యమా అని చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ ఓటమిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ, నిన్న వచ్చిన ఫలితం ఆయన్నే కాదు ఆ పార్టీనీ తీవ్రంగా నిరాశపరిచింది. సీట్లు సంగతి దేవుడెరుగు.. ఓట్ల శాతం మరీ దారుణంగా పడిపోవడంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని అంతటా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతలు తమ వైఫల్యంపై కుంటి సాకులు చెబుతున్నారు. ఈ ఓటమికి తాము కారణం కాదని.. తాము త్యాగాలు చేసి నష్టపోయామని అంటున్నారు.
కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉండడంతో వారికి ఎక్కువ సీట్లు ఉండేలా తాము త్యాగం చేశామని.. లేదంటే తాము మరిన్ని సీట్లలో పోటీ చేసి ఎక్కువ ఓట్ల శాతం పొందేవాళ్లమని అంటున్నారు. పైగా తమ ఓటు బ్యాంకు పొత్తుల పుణ్యమా అని కాంగ్రెస్ కు బదిలీ కావడంతో తమకు వచ్చిన ఓట్ల శాతం తగ్గిందని చెబుతున్నారు.
అంతేకాదు... కాంగ్రెస్ నేతలు తాము పోటీ చేసిన స్థానాల్లో సహకరించలేదని... తమకు పట్టున్న స్థానాలు కూడా కాంగ్రెస్ - టీజేఎస్ లకు ఇచ్చేశామని టీడీపీ చెబుతోంది. మొత్తానికి ఈ దారుణ వైఫల్యానికి ఎన్ని కుంటి సాకులు చెప్పాలో అన్నీ చెబుతోంది తెలుగుదేశం పార్టీ.