Begin typing your search above and press return to search.
బీజేపీలోకి టీడీపీ విలీనం.. లాంఛనంగా!
By: Tupaki Desk | 17 Aug 2019 3:57 AM GMTఇదంతా చంద్రబాబు నాయుడు స్కెచ్చే అని పరిశీలకులు అనుమానిస్తూ ఉన్నారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు మూటాముల్లే ఎప్పుడో సర్దేశారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి భారీ దెబ్బ తగిలింది. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రంగంలోకి దిగినా ఆయన బంధువులే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీడీపీ నామమాత్రంగా రెండు సీట్లను నెగ్గింది.
ఇక లోక్ సభ ఎన్నికల వరకూ వచ్చేసరికి అసలు తెలంగాణలో తన పార్టీని పోటీలోనే పెట్టలేదు చంద్రబాబు నాయుడు. పోటీలోనే పెట్టకపోవడం అంటే అంతటితో ఖేల్ ఖతం అయినట్టే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అంటూ కొంతమంది నేతలు, క్యాడర్ అయితే చివరి వరకూ కొనసాగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా చేతులు ఎత్తేయడంతో ఆ క్యాడర్ ఇన్నాళ్లూ ఒకింత సంధిగ్ధవస్థలో కొనసాగింది.
అయితే ఇప్పుడు వారంతా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారట. ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం నేతలు తలో దిక్కుకు వెళ్లారు. ఇక మిగిలిన లీడర్లు, క్యాడర్ కూడా ఏదో ఒక వైపు వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో వారందరినీ చంద్రబాబు నాయుడే దగ్గరుండి బీజేపీ వైపు పంపిస్తున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది.
ఈ మేరకు పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. చెల్లాచెదురు అయిన తెలుగుదేశం క్యాడర్ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్లడం చంద్రబాబుకు సుతారమూ ఇష్టం లేదని అంటున్నారు. తనకు సహకరించని కేసీఆర్ తన పార్టీ కేడర్ ను చేర్చుకోవడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు వారిని బీజేపీ వైపు పంపిస్తున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.
బీజేపీతో కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చాలా శత్రుత్వాన్ని నెరిపారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మెప్పును పొందాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే తన పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురిని చంద్రబాబు నాయుడు త్యాగం చేశారని, ఇప్పుటు తెలంగాణ శ్రేణులను కూడా త్యాగం చేసి బీజేపీ వైపుకు పంపుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్న త్యాగాలను బీజేపీ గుర్తిస్తుందా? అనేది మాత్రం అనుమానమే అని పరిశీలకులు అంటున్నారు!