Begin typing your search above and press return to search.

సీట్ల విష‌యంలో ఇంత దిగజారుడేంది బాబు?

By:  Tupaki Desk   |   22 Oct 2018 11:15 AM GMT
సీట్ల విష‌యంలో ఇంత దిగజారుడేంది బాబు?
X
తెలంగాణ‌లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుల వ్య‌వ‌హారంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు - విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో కాంగ్రెస్ తో పొత్తుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు మొగ్గుచూపుతున్నార‌ని - ఏపీలో ఆ పొత్తు ప్ర‌భావం పార్టీపై ప‌డుతుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు లోలోప‌ల మ‌ద‌న ప‌డుతున్నార‌ని పుకార్లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు - కాంగ్రెస్ తో పెట్టుకునేది పొత్తుకాద‌ని...కూట‌మిలో త‌మ రెండు పార్టీలు భాగ‌స్వాములు మాత్ర‌మేన‌ని చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. కానీ, వాస్త‌వానికి కాంగ్ర‌స్...ఏం చెబితే అది చేసేందుకు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకునేందుకు చంద్ర‌బాబు సిద్ధంగా ఉన్నారని తాజాగా టాక్ వ‌స్తోంది. తాజాగా హైద‌రాబాద్ లో టీ టీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మావేశంలో సీట్ల అంశంపై బాబు క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన‌న్ని సీట్లు తీసుకోవాల‌ని బాబు భావిస్తున్నార‌ట‌.

కాంగ్రెస్ కు చంద్ర‌బాబు దాసోహం అన్న విష‌యం మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని తెలంగాణ లో టాక్ వ‌స్తోంది. కాంగ్రెస్ తో సంధి కుదుర్చుకునేందుకు బాబు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌ని తెలుస్తోంది. ఆ పార్టీ ఇచ్చిన‌న్ని సీట్లు తీసుకోవాల‌ని - బేర‌సారాలు చేయ‌ద్ద‌ని తెలుగు త‌మ్ముళ్ల‌కు బాబు హిత‌బోధ చేశార‌ట‌. 30 సీట్లు డిమాండ్ చేద్దామ‌ని టీటీడీపీ నేత‌లు సూచించినా...బాబు విన‌లేద‌ట‌. కాంగ్రెస్ 12 సీట్లను ఇస్తామని చెబుతోంద‌ని - వాటితో స‌ర్దుకొని మ‌హాకూట‌మి గెలుపు కోసం కృషి చేయాల‌ని టీటీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు బాబు దిశానిర్దేశం చేశార‌ట‌. అనుకున్న దానిక‌న్నా దాదాపు స‌గం సీట్లు త‌గ్గ‌డంతో త‌మ్ముళ్లు పెద‌వివిరిచినా బాబు పెడ‌చెవిన పెట్టార‌ట‌. గత ఎన్నికల్లో టీడీపీ సొంతంగా గెలిచిన సీట్ల కన్నా తక్కువ సీట్లలో బ‌రిలోకి దిగ‌డం తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు సుతారము ఇష్టం లేద‌ట‌. పొత్తు పెట్టుకున్నా...మిత్ర‌ప‌క్ష‌మైనా...భాగ‌స్వామి అయినా....కాంగ్రెస్ కు దాసోహం అంటూ టీడీపీ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మ‌య్యేలా సాక్ష్యాత్తూ పార్టీ అధ్య‌క్షుడే ప్ర‌వ‌ర్తించ‌డంపై తెలుగు త‌మ్ముళ్లు...మింగ‌లేక క‌క్క‌లేక ఉన్నార‌ట‌.