Begin typing your search above and press return to search.
టీడీపీ ఘర్ వాపసీ మంత్రం.. ఫలించేనా..?
By: Tupaki Desk | 23 Dec 2022 4:14 AM GMTతెలంగాణలో టీడీపీ పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ఖమ్మంలో పర్యటించారు. భారీ సభ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు , పార్టీ అభిమానులు కూడా తరలి వచ్చారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీని క్రియాశీలకంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
అంతేకాదు, తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందని చంద్రబాబు సంచలన వ్యాఖ్య చేశారు. ఇదే సమయంలో ఆయన ఘర్ వాపసీ మంత్రాన్ని పఠించారు. పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి పార్టీలో చేరాలని కూడా పిలుపునిచ్చారు. గతంలో అనేక మంది నాయకులు టీడీపీ తరఫున గెలిచారని.. అయితే, వివిధ కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లారని చంద్రబాబు చెప్పారు.
ఎందుకు వెళ్లారు.. అని తాను అడగబోనని చెప్పిన చంద్రబాబు పార్టీ అవసరం అనుకునే నేతలంతా తిరిగి రావాలని కోరడం గమనార్హం. కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలను తయారుచేసి తెలంగాణలో టీడీపీని పునర్నిర్మించి.. పూర్వ వైభవం తీసుకొద్దామని ప్రకటించారు.
రాబోయే రోజుల్లో టీడీపీని తిరుగులేని పార్టీగా తయారు చేద్దామని అన్నారు. దీనికి అందరూ సహకరించాలని కూడా చంద్రబాబు చెప్పారు.
అయితే.. చంద్రబాబు ఘర్ వాపసీ మంత్రం ఏమేరకు ఫలిస్తుందనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ఏ నాయకుడు అయినా.. పార్టీ మారారు అంటే.. వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసమేననేది అందరికీ తెలిసిందే. ఈ రెండు అంశాలను ఫుల్ ఫిల్ చేసేలా టీడీపీ ఎదుగుతుందని అనుకున్నా.. వారిలో చంద్రబాబు నమ్మకం కలిగించినా.. చంద్రబాబు ప్రత్యేకంగా పిలుపునివ్వాల్సిన అవసరం లేదు. వారే వస్తారు.
కానీ, ఈ దిశగా పడాల్సిన పునాదులు చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం చంద్రబాబు సభ పెట్టింది.. ఏపీ సరిహద్దు జిల్లాలో సో.. ఇది హిట్ అయింది. అదే ఆయన ఏ దుబ్బాకో.. సిరసిల్లో, మెదక్‌లోనో.. లేదా.. ఆదిలాబాద్‌లోనో సభ పెట్టి ఇదే తరహా హిట్ కొడితే.. ఖచ్చితంగా నాయకుల్లో నమ్మకం వస్తుందనేది పరిశీలకుల వాదన. మరి ఆదిశగా చంద్రబాబు అడుగులు వేస్తే.. ఆయన కోరకుండానే నేతలు క్యూ కడతారు!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.