Begin typing your search above and press return to search.
కరోనాకు చెక్ పెట్టే డ్రోన్ ఆయుధాలు
By: Tupaki Desk | 3 April 2020 4:32 AM GMTకనిపించని శత్రువుతో పోరాటం చేసే విషయంలో మనిషి కంటే శాస్త్రసాంకేతికతను నమ్ముకోవటం మంచిది. ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నాడు మనోడు ఒకడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ కు చెందిన ప్రేమ్ కుమార్ విశ్వనాథ్ అనే ముఫ్పై ఏళ్ల యువకుడు ఇప్పుడు డ్రోన్లను ఆయుధాలుగా చేసుకున్నాడు. తన వద్ద ఉన్న వేర్వేరు డ్రోన్లతో కరోనా పిశాచిని కంట్రోల్ చేసేలా ఉండటం గమనార్హం.
ఢిల్లీలో నిర్వహించిన మత సదస్సులో పాల్గొని కరీంనగర్ కు వచ్చిన వారి పుణ్యమా అని.. ఆ ప్రాంతంలోని ముకరంపూర్ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మందికి ఆ ప్రాంతంలోనే ఆశ్రయం పొందారు. వారంతా కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేసేందుకు వీలుగా భారీ డ్రోన్లను వినియోగించారు. దీన్ని తయారు చేసింది మారుత్ డ్రోన్ టెక్ అనే కంపెనీ.
కరోనాతో కొత్త తరహా సమస్యలు తెర మీదకు వస్తున్న వేళ.. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా కొత్త తరహా సాంకేతికతను తెర మీదకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మారుత్ డ్రోన్ టెక్ కంపెనీ బాగా గుర్తించింది. కరోనా రోగులు నివసించే ప్రాంతాల్ని డిస్ ఇన్ ఫెక్ట్ చేయటం అంత తేలికైన పని కాదు. ఇలా చేసేందుకు పెద్ద ఎత్తున బాడీ సూట్స్ వేసుకొని కెమికల్ స్ప్రే చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం దొర్లినా ప్రాణాలకే ప్రమాదం.
ఇంత అపాయకర పరిస్థితుల్లో పని చేసేందుకు వీలుగా వివిధ రకాలైన డ్రోన్లను వినియోగిస్తున్నారు. చైనా.. దక్షిణ కొరియాల్లో విజయవంతంగా అమలు చేసిన ఈ విధానాన్ని మనోడు మన దగ్గర అమలుచేస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి చేసే పనికి యాభై రెట్ల అధికంగా ఒక డ్రోన్ చేసే వీలుంది. 20 కి.మీ. ప్రాంతాన్ని ఒక రోజులో ఒక డ్రోన్ ద్వారా స్ప్రే చేసే వీలుంది. ప్రస్తుతం ఈ కంపెనీ నాలుగు రకాల డ్రోన్లను తయారు చేస్తుంది. అంతేకాదు.. తెలంగాణ.. ఏపీలతో పాటు తిరుచ్చిలలో కూడా డ్రోన్లతో సేవల్ని అందిస్తోంది.
డ్రోన్లతోరసాయనాలు స్ప్రే చేయటంతో పాటు.. నిఘా కెమేరాలు.. స్పీకర్లను పెట్టి ప్రజలకు సందేశాల్ని ఇవ్వటంతోపాటు.. గుంపులు గుంపులుగా ఉండే ప్రజల శరీర ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయన్నది తెలుసుకునే వీలుంది. అత్యవసరమైన సామాగ్రిని పన్నెండు కిలోమీటర్లవరకూ తీసుకెళ్లే అవకాశం డ్రోన్లతో ఉంది. ఇలా.. డ్రోన్లతో కంటికి కనిపించని కరోనా శత్రువును గుర్తించేందుకు హైదరాబాదీ కంపెనీ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు.