Begin typing your search above and press return to search.

త్వరలో తెలంగాణకి మరో ఆరు ఆరు విమానాశ్రయాలు !

By:  Tupaki Desk   |   10 Jan 2020 7:29 AM GMT
త్వరలో తెలంగాణకి మరో ఆరు ఆరు విమానాశ్రయాలు !
X
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో అగ్ర స్థానంలో ఉంది. అలాగే ముంబై , బెంగుళూరు తరువాత ఐటీ పరంగా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. దీనితో నిత్యం బిజినెస్ పనుల మీద విదేశాలకి వెళ్లేవారు, వచ్చేవారు భారీగా ఉంటున్నారు. కానీ , ప్రస్తుతం తెలంగాణ కి ఒకే ఒక విమానాశ్రయం ఉన్నది. అది హైదరాబాద్ లోనే ఉన్నది. అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఈ ఎయిర్ పోర్ట్ కాక , తెలంగాణాకి మరో ఎయిర్ పోర్ట్ అనేది లేదు.

కానీ , రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కి దీటుగా మరికొన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలనీ సంకల్పించి అటు వైపుగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ట్విన్ సిటీస్ కి పోటీగా వరంగల్ అభివృద్ధి లో పరుగులు తీస్తుంది. దీనితో తెలంగాణ లోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది.

హైదరాబాద్ తో పాటుగా చుట్టుపక్కల ఉన్న నగరాలు, పట్టణాలులో సాఫ్ట్ వేర్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉన్నది. అక్కడ ఆ పరిశ్రమలు డెవలప్ కావాలి అంటే విమానాశ్రయాలు ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే తేలంగాణలోని ఆరు ముఖ్యమైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, కొత్తగూడెం, పెద్దపల్లి, మెహబూబ్ నగర్ లలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నారట. అయితే , అయితే వరంగల్ విషయంలో మాత్రం కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుగా నిలిచే అవకాశాలున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్ పోర్టును నిర్మించరాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, జీఎంఆర్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆర్జీఐ ఏ కు, వరంగల్ సమీపంలోని మామ్నూరుకు మధ్య 150 కిలోమీటర్ల దూరం కూడా లేదు. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.