Begin typing your search above and press return to search.
తెలంగాణలోనూ మద్యం షాపులు ఓపెన్ కానున్నాయ్!
By: Tupaki Desk | 5 May 2020 5:47 AM GMTలాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాల్ని మూసివేసిన వైనం తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 ముగిసి.. 3.0 స్టార్ట్ అయిన నేపథ్యంలో.. పలు రాష్ట్రాల్లో లిక్కర్ షాపుల్ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వేళ వినిపిస్తున్న కష్టాలకు భిన్నంగా మద్యం షాపుల వద్ద ఆడ.. మగ అన్న తేడా లేకుండా ఎగబడిన వైనం సంచనలంగా మారింది. పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్ని ఓపెన్ చేస్తున్న వేళ.. తెలంగాణ లో ఎప్పటి నుంచి షురూ చేస్తారన్నది ప్రశ్నగా మారింది.
కర్ణాటక రాష్ట్రంలో తొలి రోజు మద్యం అమ్మకాలు ఏకంగా రూ.45 కోట్లు ఉండటం.. దానిపైన వచ్చే ఆదాయం లెక్కలు పలు రాష్ట్రాల్ని ఊరిస్తున్నాయి. లాక్ డౌన్ పుణ్యమా అని రాష్ట్ర ఖజానా బక్కచిక్కిపోయిన నేపథ్యంలో.. వెనువెంటనే ఖజానా కళకళలాడాలంటే మద్యం దుకాణాలకు మించింది మరొకటి లేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో షాపుల్ని తెరిచే విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేసినా.. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరుగుతుందని.. అదే జరిగితే ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా.. కొత్త తలనొప్పులు తప్పవన్న మాట వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ మద్యం దుకాణాల్ని తెరవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ 2.0 ఏడున ముగుస్తుంది. ఎనిమిది నుంచి 3.0 స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో మే 8 నుంచి మద్యం దుకాణాలు తెరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. అంతకంటే ముందు కూడా మద్యం దుకాణాల్ని తెరిచే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ రోజు (మంగళవారం) జరిగే తెలంగాన మంత్రివర్గ భేటీలో మద్యం దుకాణాల్ని ఎప్పుడు తెరవాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవటం తో పాటు.. అధికారిక నిర్ణయాన్ని వెల్లడించే వీలుందని చెబుతున్నారు.