Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు భారీ షాకిచ్చిన తెలంగాణ ఓట‌ర్లు!

By:  Tupaki Desk   |   23 May 2019 7:16 AM GMT
కేసీఆర్ కు భారీ షాకిచ్చిన తెలంగాణ ఓట‌ర్లు!
X
సారు.. కారు.. ప‌ద‌హారు.. నినాదంతో తెలంగాణ లోక్ స‌భ ఎన్నిక‌లకు వెళ్లిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.తెలంగాణ సంగ‌తి చూడ‌మంటే.. దేశం సంగ‌తి చూస్తాన‌ని.. త‌న‌కు ప‌ద‌హారు ఎంపీ సీట్లు ఇవ్వాల‌ని కోరిన ఆయ‌న మాట‌ను తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో తాము 16సీట్ల‌లో గెలుస్తామ‌ని ధీమా చెప్పిన ఆయ‌న మాట‌లు త‌ప్పు అయ్యాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన స‌మాచారం ప్ర‌కారం (మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యానికి) తెలంగాణ‌లోని 17 ఎంపీ స్థానాల్లో అధికార టీఆర్ఎస్ కేవ‌లం 8 స్థానాల్లో మాత్ర‌మే అధిక్య‌త‌లో నిల‌వ‌గా.. అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాల్లో.. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో.. ఒక స్థానంలో మ‌జ్లిస్ అధిక్యంలో ఉంది. ప‌ద‌హారుసీట్ల‌లో కారు గెలుపు ఖాయ‌మ‌ని. వేడుక‌లు చేసుకోవాల్సిందిగా పిలుపు ఇచ్చిన కేసీఆర్ మాట ఈసారి త‌ప్పైంది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించిన అంచ‌నాలు కేసీఆర్ చెబితే త‌ప్పు కావ‌న్న‌ట్లుగా ఉన్న దానికి భిన్నంగా ఫ‌లితాలు రావ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా ఉన్న అధిక్య‌త‌ల్ని చూస్తే.. టీఆర్ ఎస్ కేవ‌లం ఎనిమిది స్థానాల్లో మాత్ర‌మే అధిక్య‌త‌లో ఉంది. దీని కంటే కూడా కేసీఆర్ ను బాధించే అంశం మ‌రొక‌టి ఉంద‌ని చెప్పాలి. ఆయ‌న కుమార్తె క‌విత నిజామాబాద్ లో ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఆమె ఓట‌మిని ఆయ‌న జీర్ణించుకోలేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

పెద్ద‌ప‌ల్లి.. జ‌హీరాబాద్‌.. మెద‌క్‌..మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌.. నాగ‌ర్ క‌ర్నూల్.. వ‌రంగ‌ల్‌.. మ‌హ‌బూబాబాద్‌.. ఖ‌మ్మం ఎంపీ స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్ గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తుంటే.. మ‌రో తొమ్మిది స్థానాల్లో ఓట‌మి దిశ‌గా వెళుతున్న దుస్థితి.

బీజేపీ అధిక్య‌త‌లో ఉన్న ఎంపీ స్థానాలు చూస్తే..

+ అదిలాబాద్ సోయం బాబురావు (బీజేపీ)
+ క‌రీంన‌గ‌ర్ బండి సంజ‌య్ (బీజేపీ)
+ నిజామాబాద్ ధ‌ర్మ‌పురి అర‌వింద్ (బీజేపీ)
+ సికింద్రాబాద్ కిష‌న్ రెడ్డి (బీజేపీ)

కాంగ్రెస్ అధిక్య‌త‌లో ఉన్న ఎంపీ స్థానాలు

+ చేవెళ్ల కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి (కాంగ్రెస్‌)
+ న‌ల్గొండ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్‌)
+ భువ‌న‌గిరి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (కాంగ్రెస్‌)
+ మ‌ల్కాజిగిరి రేవంత్ రెడ్డి (కాంగ్రెస్‌)

మ‌జ్లిస్ అధిక్య‌త‌లో ఉన్న ఎంపీ స్థానం

+ హైద‌రాబాద్ అస‌దుద్దీన్ ఓవైసీ (మ‌జ్లిస్)