Begin typing your search above and press return to search.
ఆమె మట్టి కవిత...ఈమె ఆరెంజ్ ప్యారెట్
By: Tupaki Desk | 30 Nov 2022 3:30 PM GMTతెలంగాణా రాజకీయాల్లో ఇపుడు సరికొత్త ఎపిసోడ్ సాగుతోంది. వైఎస్ షర్మిల హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆమె అరెస్ట్ పర్వం తరువాత జోరు చేస్తున్నారు. ఏకంగా కేసీయార్ నే పట్టుకుని డైరెక్ట్ గానే విమర్శలు చేస్తూ ఆమె ట్వీట్లు చేస్తున్నారు. ఎక్కడా తగ్గేదిలే అని క్లారిటీ ఇస్తున్నారు. మరి టీయారెస్ సేనలు ఊరుకుంటాయా. కేసీయార్ తనయ కవిత సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
షర్మిలను బీజేపీ బాణంగా అభివర్ణిస్తూ నిన్నటిదాకా పులివెందుల ఓటు ఇపుడు తెలంగాణా రూటు ఆరెంజ్ ప్యారెట్ పొలిటికల్ టూరిస్టు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజ్యం వచ్చాక రాలేదని ఉద్యమంలో పుట్టిన మట్టి కవితను అని తన గురించి కల్వకుంట్ల వారి కూతురు చెప్పుకున్నారు.
ఆమెని గులాబీతోటలో ఒక కవితగా అంతకు ముందు షర్మిల కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే షర్మిల వెనక బీజేపీ ఉందని, ఆమె కమలం విడిచిన బాణమని కవిత ఆరోపిస్తున్నారు. అయితే తాను సొంతంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాను తప్ప ఎవరూ తనతో లేరని షర్మిల గట్టిగానే జవాబు ఇస్తున్నారు.
ప్రజా సమస్యలు ప్రజలు పాదయాత్రలు లేని గులాబీ తోటలో ఎన్నో కవితలు అంటూ ఆమె కవిత మీద సెటైర్లు పేల్చారు. ఇవి ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇపుడు తెలంగాణాలో షర్మిల గురించి చర్చ సాగుతోంది. ఆమె రెండేళ్ల రాజకీయ జీవితంలో ఇదొక మేలి మలుపుగా ఉంది. ఆమె గురించి తెలంగాణా సమాజం ఇపుడు పట్టించుకుంటోంది.
అయితే అది పాజిటివ్ గానా నెగిటివ్ గానా అన్నది పక్కన పెడితే ఆమె బాగానే ఫోకస్ అవుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాల్సింది ఏంటి అంటే షర్మిల లో ఉన్న ఫైర్ పట్టుదల ఏంటి అనేది ఆమెని కార్ లో అలా ఉంచి క్రేన్ లో పోలీసులు తీసుకెళ్ళినపుడు లోకమంతా చూసింది. దీని మీదనే అంతా ఆమె గురించి చర్చించుకుంటున్నారు.
ఒక విధంగా ఆమెకు సింపతీ దక్కింది. మరి అది తెలిసి చేశారా లేక దూకుడుగా తీసుకున్న నిర్ణయమా తెలియదు కానీ షర్మిల ఒక్కసారి ఎలివేట్ అయ్యారు. దాంతో ఆమెను తగ్గించడానికి అన్నట్లుగా కవిత సడెన్ గా సీన్ లోకి వచ్చారు అని అంటున్నారు. కవిత అంటే ఉద్యమ కాలం నుంచి ఉన్నారు. తండ్రి కేసీయార్ మాదిరిగానే ఆమె గట్టిగా మాట్లాడతారు.
ఇక షర్మిలది వైఎస్సార్ తో వచ్చిన మొండితనం పట్టుదల అని నిన్నటి రోజున రుజువు అయింది. తెలంగాణాలో తన రాజకీయాన్ని వెతుక్కోవాలని ఆమె చూపిస్తున్న దూకుడే ఆమె గురించి చర్చించుకునేలా చేస్తునాయని అంటున్నారు. షర్మిలను బీజేపీ కి బీ టీం గా జత కట్టి ఆమె ప్రభావాన్ని తగ్గించాలని టీయారెస్ అనుకుంటోంది. అనివార్యంగా ఇపుడు ఆమె గురించి మంత్రుల నుంచి ఆఖరుకు కేసీయార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడాల్సి వస్తోంది.
మరో వైపు చూస్తే షర్మిల రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ని కలవడం ద్వారా తన మీద తన పాదయాత్ర మీద టీయారెస్ సర్కార్ సాగించిన దాష్టికాన్ని వివరించనున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల కమలం వదిలిన బాణం అవునో కాదో తెలియదు కానీ ఆమె ఇపుడు టీయారెస్ కి టార్గెట్ అయ్యారు. ఇది చాలు షర్మిల పోరాటం హిట్ అని చెప్పడానికి అని వైఎస్సార్టీపీ నేతలు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.