Begin typing your search above and press return to search.
తెలంగాణలో మరో 2,734 పాజిటివ్ కేసులు!
By: Tupaki Desk | 1 Sep 2020 6:00 AM GMTతెలంగాణలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,734 కేసులు నమోదయ్యాయి. అలాగే , మరో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మరో 2,325 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇక తాజాగా నమోదు అయిన కరోనా కేసులతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,27,697కు చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 31,699 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 95,162 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 836కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 347 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 0.65శాతం మరణాల రేటు ఉండగా, దేశంలో 1.77శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 74.5శాతంగా ఉందని చెప్పింది.
తాజాగా సోమవారం ఒకే రోజు 58,264 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 14,23,846 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. 878 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 38,358 మందికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ GHMC పరిధిలో 347 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. తర్వాత అత్యధికంగా రంగారెడ్డిలో 212, నల్గొండ 191, ఖమ్మం 161, భద్రాద్ది కొత్తగూడెం 117, నిజామాబాద్ 114, వరంగల్ అర్బన్ 112, సిద్దిపేట 109, సూర్యాపేట 107, కరీంనగర్‌లో 106 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇకపోతే , తెలంగాణలో కరోనా మహమ్మారి బారినపడిన వారిలో 31 శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, 69 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కేసులను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,24,963 మంది కరోనా బారినపడగా వారిలో 86,225 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొంది. '