Begin typing your search above and press return to search.
అమెరికా జట్టులో హైదరాబాదీ అమ్మాయి
By: Tupaki Desk | 28 Jun 2017 10:22 AM GMTఅమెరికాలో తెలుగు వాళ్లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా.. డాక్టర్లుగా.. ఇంకా మరిన్ని ప్రొఫెషన్లలో ఎప్పట్నుంచో హవా సాగిస్తున్నారు. ఐతే ఇప్పుడు ఓ తెలుగుమ్మాయి ఆ దేశ క్రీడా రంగంలోనూ తన ప్రత్యేకత చాటి చెప్పింది. అమెరికన్ నేషనల్ క్రికెట్ టీంలో ఓ తెలుగుమ్మాయి చోటు సంపాదించడం విశేషం. ఆ అమ్మాయి పేరు.. సింధుజ రెడ్డి. ఈ ఆగస్టులో స్కాట్లాండ్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ లో అమెరికా తరఫున ఆడబోతోంది సింధుజ. ఈ అమ్మాయిది హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ అండర్-19 జట్టు తరఫున అనేక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో పాల్గొంది సింధుజ.
ఐతే క్రికెట్ కెరీర్లో ఎదుగుతున్న సమయంలోనే ఆమె సిద్దార్థ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. దీంతో ఆమె క్రికెట్ కెరీర్ కు తెరపడినట్లయింది. కానీ అమెరికా వెళ్లాక మళ్లీ అమెరికా క్రికెట్ క్లబ్బుల్లో ఆడటం మొదలుపెట్టింది సింధుజ. ఆ క్లబ్బుల్లో సత్తా చాటుకోవడంతో అమెరికా జాతీయ జట్టులో చోటు సంపాదించింది. సింధుజ మంచి బ్యాటరే కాదు.. వికెట్ కీపర్ కూడా. క్రికెట్ అమెరికాలో అంత పాపులరేమీ కాదు. అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలతో పోలిస్తే ఆ దేశం ఎక్కడో ఉంటుంది. ఇప్పుడిప్పుడే అక్కడ క్రికెట్ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నారు. మన దగ్గర రాష్ట్ర స్థాయి క్రీడాకారులు కూడా అమెరికాలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగల స్థాయిలో ఉంటారు. సింధుజ కూడా అలాగే అమెరికా జట్టులో చోటు సంపాదించింది. 2020 వన్డే ప్రపంచకప్ లో ఆడాలన్న లక్ష్యంతో ఉన్న సింధుజ.. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ లో సత్తా చాటి జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/