Begin typing your search above and press return to search.

ఆంధ్ర, తెలంగాణల మధ్య నలిగిపోతున్నాం

By:  Tupaki Desk   |   18 July 2015 7:05 AM GMT
ఆంధ్ర, తెలంగాణల మధ్య నలిగిపోతున్నాం
X
తాము ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నామని కోర్టులో వాపోయాయి టెలికం కంపెనీలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల విచారణను ఎదుర్కొంటున్న టెలికం కంపెనీలు కోర్టులో ఈ అంశాన్ని నివేదించాయి. హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ ముఖ్యుల ఫోన్లను ట్యాప్ జరిగిందని అంటూ ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ విషయం వివరాలను ఇవ్వాలని వివిధ టెలికం కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

వారిని సిట్ అధికారులు విచారించారు. అయితే సిట్ కోరుతున్న టెలికం కంపెనీలు డాటాను ఇవ్వలేదని అంటూ కోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలు కోర్టుకు తమ పరిస్థితిని నివేదించుకొన్నాయి. కాల్ డాటా కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని.. ఫోన్ ట్యాపింగ్ వివరాలను ఇవ్వాలని అంటూ ఏపీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, అయితే కాల్ డాటాకు సంబంధించిన ఎలాంటి వివరాలూ వెలుగు చూడటానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు నోటీసులు వచ్చాయని టెలికం కంపెనీ ఆపరేటర్లు చెబుతున్నారు.

ఇటు ఒత్తిడి, అటు నోటీసులు.. వీటిలో ఎవరు చెప్పినట్టుగా నడుచుకోవాలో.. ఏం ఏయాలో తాము అర్థం కాని స్థితిలో ఉన్నామని ఆయా కంపెఈనల ప్రతినిధులు కోర్టుకు విన్నవించుకొన్నారు. ఈ నేపథ్యంలో కాల్ డాటాను భద్రపరచాలని ఆదేశిస్తూ న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసింది. మరి ఇకపై ఈ వ్యవహారం ఎలా ముందుకు వెళుతుందో!