Begin typing your search above and press return to search.
ఏపీ లో టెలి వైద్యంతో ఎంత లాభం?
By: Tupaki Desk | 26 April 2020 5:38 AM GMTకరోనా మహమ్మారి కారణంగా పక్కింటివాళ్లతో మాట్లాడాలంటేనే జంకుతున్న రోజులివి. ఇక దేశాలకు దేశాలే సరిహద్దు మూసుకోవాల్సి వచ్చింది. మన దేశంలో కరోనాకు చికిత్స అందించే డాక్టర్లు మాత్రం ఊపిరి సలపనంత బిజీగా ఉంటున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో పాటు వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా ఆ వ్యాధికి మాత్రమే చికిత్స చేసే ఆసుపత్రు - డాక్టర్లు బిజీగా ఉన్నారు. ఇతర వ్యాధులకు చికిత్స చేసే ఆసుపత్రు - వైద్యులు ఇంటికే పరిమితమవడంతో వేరే వ్యాధులతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాంటి వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ టెలిమెడిసిన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ప్రజలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ విధానంతో కేవలం ప్రారంభించిన ఈ వారం రోజుల్లోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. గత వారం రోజుల్లో దాదాపు 10 వే మంది చికిత్స చేయించుకున్నారు. కరోనా కాలంలో ఆకస్మికంగా ఇతర రోగాల బారిన పడినవారు - దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ తరచు - నిరంతరం చికిత్స అవసరమైన రోగులు తీవ్రంగా ఇబ్బంది పడతున్నారు. ముఖ్యంగా కిడ్నీ - హృదయ - బిపి - షుగర్ - వంటి వ్యాధులతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. వీరికి దాదాపుగా వైద్యు పర్యవేక్షణ - చికిత్స - మందు అందుబాటు మొదలైనవి చాలా కీకమైనవి.
టెలిమెడిసిన్ తో ఫోన్ లోనే పరిష్కారాలు
ఇలాంటి వ్యాధుల తీవ్రతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లతో పాటు వైయస్ ఆర్ టెలీమెడిసన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజా రవాణా స్థంభించిన నేపధ్యంలో ఫోన్ ద్వారానే ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన 14410 టోల్ ఫ్రీ నెంబర్ కు గత వారం రోజుల్లో 9697 రోగులు చికిత్స చేయించుకున్నారు. ఇందులో అవసరమైన 4,732 మందికి సంబంధిత డాక్టర్లు టెలీ మెడిసిన్ పద్ధతిలో తమ సేవలను అందించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన మందుల సమాచారాన్ని అందజేశారు. 14410 నెంబర్ కు ఫోన్ చేయగానే డాక్టర్లు ఫోన్ ద్వారానే సలహాలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందుల వివరాలను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ కు సమాచారమిస్తున్నారు. అక్కడి నుంచి మందులను అవసరాన్నిబట్టి పేషెంట్ ఇంటికే సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. వైద్య సేవలు కావాల్సిన వారు 14410 ఫోన్ నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు - డాక్టర్ ఫోన్ చేసి ఆరోగ్య వివరాలను అడిగి తీసుకుంటారు. ఆ వ్యక్తికి ఒక గుర్తింపు సంఖ్యను ఇస్తారు. డాక్టరు రోగిని అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత వ్యాధి క్షణాకు అనుగుణంగా మందును సూచిస్తున్నారు. ఈ మందునూ రోగి ఇంటి వద్దకే తీసుకెళ్లి ఆశా కార్యకర్త - ఎఎన్ ఎంతో అనుసంధానం చేసి సంబంధిత వాలంటీర్ ద్వారా ఆ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మందులను ప్రత్యేక ప్యాక్ తో అందిస్తున్నారు.
కరోనా కేసుల గుర్తింపు
టెలిమెడిసిన్ ద్వారా ఇతర వ్యాధులతో పాటు కరోనా కేసులను కూడా వైద్యులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 119 మందిని ఇలా గుర్తించగా అందులో ఒక్కరోజే కర్నూల్ - గుంటూరు - తూర్పుగోదావరి - కడప జిల్లాల్లో 10 మందిని గుర్తించారు. ఇలా కరోనాను గుర్తించడంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా డాక్టర్ వైయస్సార్ టెలికాన్ఫరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతోంది.
అద్భుతంగా పనిచేస్తోన్న టెలిమెడిసిన్ విధానం...
కరోనా రాష్ట్రాన్ని ముఖ్యంగా కర్నూలు - గుంటూరు - కృష్ణా - చిత్తూరు - నెల్లూరు జిల్లాల్లో విస్తరిస్తుండడంతో ఆయా జిల్లాల్లో ఆసుపత్రి మూత వల్ల కరోనా కాకుండా ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన చికిత్స పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితిల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతర చికిత్సల కోసం ప్రత్యేక వైఎస్ ఆర్ టెలిమెడిసిన్ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం వల్ల ఇప్పటికే 59101 మందికి వైద్యం అందచేశారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 6372 మొదటి స్థానంలో ఉండగా అనంతపురం 6039తో రెండవ స్థానంలో ఉంది. ఇక ఆరోగ్య చికిత్సలు - రోగాల వారీగా పరిశీలిస్తే గర్భిణులు 16311 మందికి చికిత్స అందిస్తే నిన్న (ఏప్రిల్ 24) ఒక్క రోజే 339 మందికి చికిత్స చేశారు. రెస్పిరేటరీ థెరపీ (ఆర్టి) అంటే ఊపిరితిత్తుల సమస్యలు - ఆస్తమా మొదలైనవాటితో బాధపడుతున్న4060 మందిని ఆదుకున్నారు. విషం బారిన పడినవారు 1146మంది చికిత్స పొందారు. ముఖ్యమైన రోగాలైన కిడ్నీ బాధితుల్లో 353 మందికి డయాసిస్ - హృద్రోగంతో బాధపడుతున్నవారిలో 1330 మందికి అత్యవసర చికిత్సను చేశారు. ఇందులో భాగంగా అవసరమైన అంబులెన్సును కూడా సిద్ధంగా వుంచారు. కరోనా రోగులను తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్న అంబులెన్సును ఇక్కడ రోగుల కోసం ఉపయోగించడం లేదు. కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం వున్నందున అంబులెన్సు విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
కరోనా పరీక్షల్లో దేశంలో...
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అధిక సంఖ్యలో (ప్రతి మిలియన్ జనభా లెక్కలోకి తీసుకుంటే) అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 వ తేదీ నాటికి 61266 పరీక్షలు నిర్వహించగా అందులో 1016 కోవిడ్ బాధితులుగా గుర్తించారు. వీరిలో 31 మంది మరణించగా 171 మందికి మెరుగుపడటంతో (నెగెటివ్) ఆసుపత్రు నుంచి ఇళ్లకు పంపించేశారు. రాష్ట్రంలో సర్వైలెన్స్ - రాపిడ్ టెస్టింగ్ అధికంగా వున్నందున (మిగిలిన రాష్ట్రతో పోలిస్తే) పాజిటివ్ కేసు కూడా (అసింప్టమ్స్) బయటపడుతున్నాయనేది ఒక అంచనా. మొత్తం 1016 కేసులకు గానూ 335 ప్రైమరీ - 119 సెకండరీ కేసులు వున్నాయి. మరో 64 కేసులు ఏ రకమైనవనేది ఇంకా నిర్ధారణ కావాలి. మిగిలిన రాష్ట్రలతో పోలిస్తే ఏపీలో సెకండరీ కేసులు తక్కవుగానే వుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం.
---ఎస్ వి రావ్