Begin typing your search above and press return to search.
ఆత్మహత్య చేసుకున్న టీవీ యాంకర్ !
By: Tupaki Desk | 3 Aug 2020 8:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి మరింత భయంకరంగా రూపాంతరం చెందుతుంది. రోజురోజుకూ నమోదు అయ్యే కేసుల సంఖ్య చూస్తుంటే అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇండియా లో ప్రతిరోజూ కూడా 50 వేలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి విజృంభణ తో దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ కరోనా వ్యాధి సోకిన తరువాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దీనితో ఎంతోమంది ఉద్యోగాలు పోయి , జీవితాన్ని సాగించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పనిలేక, తినడానికి తిండి లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ .. ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. అందులో కొందరు సెలబ్రిటీలు సైతం ఉన్నారు.
ఇక తాజాగా ఓ 24 ఏళ్ల టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటోన్న ప్రియా జునీజా.. గత శుక్రవారం ఉదయం ఎంతసేపైనా బయటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె గది తలుపులు పగలగొట్టగా ప్రియా ఫ్యాన్ కి ఉరేసుకొని విగతజీవిగా తాడుకి వ్రేలాడుతూ కనిపించింది. ఇకపోతే , ప్రియా పలు ఛానెళ్లలో న్యూస్ రీడర్ గా, యాంకర్ గా పనిచేశారు. కరోనా నేపథ్యంలో ఆమె ఉద్యోగం పోగా, ఆ తరువాత యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించింది. అయితే దానికి అనుకున్నంత మైలేజ్ రాలేదు, దానితో డిప్రెషన్‌లోకి వెళ్లిన ప్రియా, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతిపై సన్నిహితులు సంతాపం ప్రకటించారు.