Begin typing your search above and press return to search.

అమెరికాలో అత్యధికంగా మాట్లాడే మూడో భాష తెలుగు

By:  Tupaki Desk   |   27 Jun 2018 6:13 AM GMT
అమెరికాలో అత్యధికంగా మాట్లాడే మూడో భాష తెలుగు
X
అమెరికాలో విస్తృతంగా మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉందని హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ అయిన కేథరిన్ హడ్డా తెలిపారు. అమెరికాలో నిర్వహించిన 2012-16 జనాభా లెక్కల ప్రకారం తెలుగు ఈ స్థానాన్ని ఆక్రమించిందని ఆమె తెలిపారు.

హైదరాబాద్ లో మంగళవారం ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వరంలో అమెరికా దేశ 242వ స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు.

‘అమెరికా సమాజంలో భారతీయులు.. ముఖ్యంగా తెలుగు ప్రజల ముద్ర చెరగనిది.. అమెరికా ఆర్థిక - సామాజిక ఎదుగుదలలో తెలుగు ప్రజలు కలిసిపోయి అభివృద్ధికి పాటుపడ్డారు. ఇక్కడి నలుగురు కుటుంబాల్లో ఒకరితో అమెరికాలోని తెలుగువారితో సంబంధాలున్నాయి..తెలుగు ప్రజలందరూ అమెరికా కుటుంబంతో కలిసిపోయి ఎవ్వరూ ఊహించని విధంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ - ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాలో చదువుకుంటూ అక్కడే ఉపాధి పొందుతున్నారు’ అని హబ్బా అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలోనే పాల్గొన్న ఐటీ - పరిశ్రమల శాఖమంత్రి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ - అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని.. తెలంగాణ వాళ్లు ఎంతో మంది అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.